అతి మొహమాటం వద్దు..

మీకు తెలియకుండానే మిమ్మల్ని అతిగా పొగిడేసి నువ్వు మాత్రమే నాకీ పని చేసి పెట్టగలవని అనేవారూ ఉంటారు. అలాంటప్పుడు పాపం నిజమే కావొచ్చు.. అని ఒప్పేసుకుంటాము.

Published : 02 May 2023 00:13 IST

మీకు తెలియకుండానే మిమ్మల్ని అతిగా పొగిడేసి నువ్వు మాత్రమే నాకీ పని చేసి పెట్టగలవని అనేవారూ ఉంటారు. అలాంటప్పుడు పాపం నిజమే కావొచ్చు.. అని ఒప్పేసుకుంటాము. అది మనకి తలకి మించిన భారం అవుతుంది. చచ్చీచెడి ఒకసారి పూర్తి చేస్తాం. పదేపదే ఇలాంటివే జరిగితే మాత్రం  సున్నితంగా నేను చెయ్యలేనని చేప్పేయండి.

* బంధువులో, స్నేహితులో ఇంటికి వచ్చినప్పుడు నాకు అది తినాలనుంది. ఇది కావాలి.. అనే గొంతెమ్మ కోరికలు సహజమే. మీకు చేయటం రానివైనా, ఆ పని కోసం ఎక్కువగా కష్టపడాల్సొచ్చినా కూడా మొహమాటంతో చేస్తానని ఒప్పేసుకుంటాం. దాని కోసం బోలెడు శ్రమ పడి నానా హైరానా పడాల్సొస్తుంది. ఎవరైనా పని చెప్పగానే మన శక్తి సామర్థ్యాలేంటో అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత వారికి అర్థమయ్యేలా దాన్ని వివరించాలి. నేను ఇప్పుడు దీనికి సమయం కేటాయించలేను.. ఏమనుకోవద్దు.. అనే మాటలతో సానుకూలంగా తప్పించుకుంటే ఇద్దరికీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని