ఆఫీసులో రాజకీయాలా..
ఇంట్లో బంధాలు, బంధుత్వాల మధ్యే చిన్న చిన్న తగాదాలు సహజం. అలాంటిది ఆఫీసు అన్నాక గొడవలు ఉంటూనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా కలిసి ఒకే తాటి మీద నడవాలంటే కష్టమే. భిన్న మనస్తత్వాలు, పని తీరు ఉంటాయి.
ఇంట్లో బంధాలు, బంధుత్వాల మధ్యే చిన్న చిన్న తగాదాలు సహజం. అలాంటిది ఆఫీసు అన్నాక గొడవలు ఉంటూనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా కలిసి ఒకే తాటి మీద నడవాలంటే కష్టమే. భిన్న మనస్తత్వాలు, పని తీరు ఉంటాయి. అలాంటివి అర్థం చేసుకొని సర్దుకుపోతే జీవితంలో ఎక్కడైనా నెగ్గొచ్చంటున్నారు నిపుణులు..
* మీరు చేసిన పనికి ఇతరులు ఫలితం తీసుకుంటే చాలా కోపమొస్తుంది. అలాంటి సమయంలో ఆవేశపడితే లాభం లేదు. అందుకని ఎప్పుడు చేసిన పనిని అప్పుడు ఫైల్ చేసి పెట్టుకోవాలి. నిరూపించాలనుకున్నప్పుడు ఆధారాలు చూపిస్తే సరి.
* ఇతరుల గురించి ఆఫీసులో గాసిప్స్ చాలా వింటాం. ఎవరెవరి గురించో మాట్లాడుకున్నవన్నీ వినీ, పట్టించుకోవద్దు. ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి.
* ఇతరులకు మనకంటే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని అసూయ పడటం తప్పు. కృషి ఎక్కువగా చేస్తే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇంత చిన్న విషయానికి ఎదుటి వారు ఎదిగిపోతున్నారని ఈర్ష్య చెందటం మంచిది కాదు.
* సహోద్యోగులతో పక్షపాత ధోరణితో కాకుండా స్నేహభావంతో మెలగాలి. ఈ సానుకూల అంశాలన్నీ ఎదగడంలో దోహదపడతాయి. కెరియర్‌లోనైనా, జీవితంలోనైనా చెడును వదిలేసి మంచిని తీసుకుంటే ముందడుగు వేయగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.