శక్తి, సత్తా రెండూ ఉన్నాయి!

ఇంట్లో వాళ్ల మనసెరిగి అడగకుండానే అన్నీ సమకూర్చడం, పిల్లలకు ఓనమాలు దిద్దించడం దగ్గర్నుంచి ఇది తప్పు, అది చేయాలంటూ నేర్పించడం, నలుగురికీ సాయపడేలా ఇంట్లోవాళ్లను ప్రోత్సహించడం... మహిళలుగా మనం సహజంగా చేసుకుంటూ పోయే పనులెన్నో!

Updated : 08 Mar 2024 12:20 IST

ఇంట్లో వాళ్ల మనసెరిగి అడగకుండానే అన్నీ సమకూర్చడం, పిల్లలకు ఓనమాలు దిద్దించడం దగ్గర్నుంచి ఇది తప్పు, అది చేయాలంటూ నేర్పించడం, నలుగురికీ సాయపడేలా ఇంట్లోవాళ్లను ప్రోత్సహించడం... మహిళలుగా మనం సహజంగా చేసుకుంటూ పోయే పనులెన్నో! అలాంటిది ‘ఆర్థిక విషయా’లకు వచ్చేసరికి ఒక్క అడుగు ముందుకు వేయడానికీ ఆలోచిస్తాం. అది మనకు కొరుకుడు పడని విషయమని ఇంట్లో మగవాళ్లకే ఆ బాధ్యత అప్పజెబుతాం. కాబట్టే, పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య 40 శాతం కంటే తక్కువగా ఉంది అంటోంది ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌. ‘రాబోయే తరాల భవిష్యత్తును దిశానిర్దేశం చేయడంలో మహిళలదే ప్రధాన పాత్ర. మెరుగైన సమాజాన్ని నిర్మించగల శక్తి, సత్తా రెండూ ఉన్నవాళ్లు మీరు. అలాంటి మీకు ఫైనాన్షియల్‌ అంశాలు ఒక లెక్కా? ఓపిక, పట్టుదల, చిత్తశుద్ధి... స్వతహాగా మీలో కనిపించే లక్షణాలు. పెట్టుబడి విషయంలో కావాల్సిందీ అవే. కాబట్టి, మనసు మాట వినండి. ఇక్కడా స్వీయనిర్ణయాలు తీసుకోండి’ అని పిలుపునిస్తోంది. మరి... పట్టించుకుందామా ఆర్థిక విషయాలు? డబ్బు విషయంలో ఇకనైనా తీసుకుందామా స్వీయ నిర్ణయాలు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్