మగువల కోసం... గ్రంథాలయం

ఇంటి పనయ్యాక కొంత సమయం పుస్తకాలకోసం కేటాయిస్తే? కొత్త విషయాలు తెలుస్తాయి. మానసిక ప్రశాంతత కూడా.

Published : 09 Mar 2024 01:19 IST

ఇంటి పనయ్యాక కొంత సమయం పుస్తకాలకోసం కేటాయిస్తే? కొత్త విషయాలు తెలుస్తాయి. మానసిక ప్రశాంతత కూడా. ఆ వెసులుబాటునే కల్పిస్తోంది రాజమహేంద్రవరంలోని మహిళా గ్రంథాలయం...

గువలకు జ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక, సాంఘిక, వైద్య, విజ్ఞాన సంబంధమైన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇంటి పనులన్నీ అయ్యాక చదువుకోవడానికి వీలుగా ఉండేలా ఈ లైబ్రరీ సమయాలను ఏర్పాటు చేశారు. గ్రంథాలయాధికారిణి అబ్బిరెడ్డి చంద్రపద్మాదేవి పర్యవేక్షణలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5గం. వరకు ఈ గ్రంథాలయం పనిచేస్తుంది. పోటీపరీక్షలకు అవసరమైన పుస్తకాలూ ఇక్కడ దొరుకుతాయి. సివిల్స్‌ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే చదువుకుంటారు. దాదాపుగా 10వేల వరకు పుస్తకాలు ఉండగా 834మంది సభ్యులు ఈ లైబ్రరీని వినియోగించుకుంటున్నారు.

  సూర్యకుమారి, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్