ఆందోళన పెరిగిపోతోంది..

నాకు పెళ్లై పదేళ్లు. మావారు చాలా మంచివారు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు. మా అత్తగారికి మాత్రం కోపమెక్కువ. చిన్నవిషయాలకే పెద్దగా అరిచేస్తుంటారు. కాసేపయ్యాక బాగానే ఉంటారు. కానీ, ఈలోగా నేను బాగా డిస్టర్బ్‌ అవుతున్నా. ఆందోళన బాగా పెరిగిపోతోంది. పరిస్థితి మారాలంటే ఏం చేయాలి?

Published : 04 Sep 2023 01:54 IST

నాకు పెళ్లై పదేళ్లు. మావారు చాలా మంచివారు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు. మా అత్తగారికి మాత్రం కోపమెక్కువ. చిన్నవిషయాలకే పెద్దగా అరిచేస్తుంటారు. కాసేపయ్యాక బాగానే ఉంటారు. కానీ, ఈలోగా నేను బాగా డిస్టర్బ్‌ అవుతున్నా. ఆందోళన బాగా పెరిగిపోతోంది. పరిస్థితి మారాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

పెళ్లయ్యాక భర్తతో పాటు అత్తమామలు కూడా ముఖ్యమే. మీవారు మిమ్మల్ని అర్థం చేసుకుని, ప్రేమగా, అండగా ఉన్నారని చెప్పారు. అది సంతోషించదగ్గ విషయం. త్వరగా కోపం రావడం, ఆ వెంటనే మామూలైపోవడం మీ అత్తగారి స్వభావం అయ్యుండొచ్చు. ఉద్వేగాలు త్వరగా నియంత్రించుకోలేని వ్యక్తిగా కనిపిస్తున్నారామె. అలాగని మీలో మీరే బాధ పడటం వల్ల ప్రయోజనం ఉండదు. మిగతా విషయాల్లో బాగుంటారు అని మీరే చెబుతున్నారు కాబట్టి, ఇదొక బలహీనతగా గుర్తించండి. కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం ఆవిడ నిస్సహాయత. కాబట్టి, తను మామూలుగా ఉన్నప్పుడు.. ‘అత్తయ్యా మీరు అన్ని విషయాల్లో బాగుంటారు. కానీ కోపంలో మాత్రం తూలనాడి బాధపెడుతున్నార’ని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఆమె తన ప్రవర్తనని గమనించుకుంటారు. కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. లేదా ఏదైనా సందర్భంలో కోపం నియంత్రించుకోలేక అలాగే ప్రవర్తిస్తోంటే.. ఆ సమయంలో దూరంగా వెళ్తానని, ఇది ఆవిడను లక్ష్యపెట్టకపోవడం కాదు.. వాతావరణం మరింత పాడవకుండా చేసే ప్రయత్నమేనని చెప్పండి. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తవు. అవసరమైతే మీవారి సాయాన్నీ కోరొచ్చు. కోపం వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాసేపు దూరంగా ఉంటే.. ఆమె కూడా అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరూ మానసికంగా కుంగిపోకుండా నిబ్బరంగా ఉండగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్