పాప పుట్టాక.. ఎందుకలా?

మా చెల్లి వయసు 25. పెళ్లై రెండేళ్లవుతుంది. ఒక పాప. ప్రెగ్నెన్సీ సమయంలో.. అంతకుముందు కూడా రక్తహీనత ఉంది. కోపం ఎక్కువ. చిన్న మాటకికూడా చిరాకు పడుతుంది. కుటుంబ సభ్యుల్నీ పాప దగ్గరకు రానివ్వటం లేదు. ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఈ ప్రవర్తన తనకూ, తన భర్తకూ మధ్య గొడవలకు కారణమవుతోంది.

Published : 18 Dec 2023 02:04 IST

మా చెల్లి వయసు 25. పెళ్లై రెండేళ్లవుతుంది. ఒక పాప. ప్రెగ్నెన్సీ సమయంలో.. అంతకుముందు కూడా రక్తహీనత ఉంది. కోపం ఎక్కువ. చిన్న మాటకికూడా చిరాకు పడుతుంది. కుటుంబ సభ్యుల్నీ పాప దగ్గరకు రానివ్వటం లేదు. ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఈ ప్రవర్తన తనకూ, తన భర్తకూ మధ్య గొడవలకు కారణమవుతోంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు. ఎందుకిలా ప్రవర్తిస్తోంది?

ఓ సోదరి

స్త్రీలలో డెలివరీ తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఇది కొంతమందిలో కుంగుబాటుకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. ఇది ఉన్న వాళ్లు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకపోవటం, పిల్లల్ని అశ్రద్ధ చేయటం లేదా ఎక్కువగా సంరక్షించుకోవటం చేస్తారు. కోపం, చిరాకుతో సతమతమవుతారు. సాధారణంగా ప్రసవం తర్వాత 6నెలల వరకు ఇలా ఉంటుంది. కొంతమందిలో రక్తహీనత వల్ల కూడా ఇలా జరుగుతుంది. చిరాకు, నీరసం, నిస్సత్తువ, నిరుత్సాహం వంటివి ఉంటాయి. ఈ రెండూ కలసి ఉండటం మూలాన మీ చెల్లి ఇలా ప్రవర్తిస్తోందనిపిస్తోంది. ఇలాంటివారు అభద్రతాభావంతో పాపకు ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో పిల్లల్ని ఎవర్నీ ముట్టుకోనివ్వరు. ఈ డిప్రెషన్‌ తనకు ప్రసవం తర్వాత  వస్తే  సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు యాంటీ డిప్రెసెంట్స్‌తోపాటు కౌన్సెలింగ్‌ ఇస్తారు. కొంతమందిలో డెలివరీ తర్వాత అనుమానాలు, భ్రమలు, భయభ్రాంతులకు లోనైనా ఇలా ప్రవర్తిస్తారు. దీన్ని పోస్ట్‌ పార్టమ్‌ సైకోసిస్‌ అంటారు. ఈ లక్షణాలను గుర్తిస్తే యాంటీ సైకోటిక్స్‌ మందులు ఇస్తారు. కుటుంబ సభ్యులకూ వారితో ఎలా మెలగాలన్నది కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒకవేళ తన వ్యక్తిత్వమే ఇలా అయితే, పెద్దగా మార్పులేమీ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత మానసిక స్థితికి మాత్రం వైద్యం అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్