మరో పెళ్లి చేసుకుంటే... బిడ్డపై హక్కుండదా!

బాబు పుట్టిన రెండేళ్లకు నా భర్త కొవిడ్‌తో మరణించారు. అప్పటికి ఆయన పేరున మూడెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మా వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆస్తులపై పవరాఫ్‌ అటార్నీ మా మామయ్య తీసుకున్నారు. ఆస్తులను మా మరిది పేరు మీదకు బదలాయించారు. ఈ విషయం తెలిసి అడిగితే... పెద్దయ్యాక అవి మీ బిడ్డకే ఇస్తాం అని చెబుతున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను మరో పెళ్లి చేసుకుంటే పిల్లాడు అన్యాయమైపోతాడంటూ పంచాయతీ పెట్టారు.

Updated : 09 Jan 2024 12:13 IST

బాబు పుట్టిన రెండేళ్లకు నా భర్త కొవిడ్‌తో మరణించారు. అప్పటికి ఆయన పేరున మూడెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మా వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆస్తులపై పవరాఫ్‌ అటార్నీ మా మామయ్య తీసుకున్నారు. ఆస్తులను మా మరిది పేరు మీదకు బదలాయించారు. ఈ విషయం తెలిసి అడిగితే... పెద్దయ్యాక అవి మీ బిడ్డకే ఇస్తాం అని చెబుతున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను మరో పెళ్లి చేసుకుంటే పిల్లాడు అన్యాయమైపోతాడంటూ పంచాయతీ పెట్టారు. వాడి బాధ్యత మాదే అనీ, నువ్వెప్పుడైనా చూసెళ్లొచ్చనీ చెప్పారు. కానీ, ఇప్పుడు నా ఫోన్లు కూడా ఎత్తడం లేదు. నా బిడ్డను చూసుకోనివ్వడం లేదు. నేనేం చేయాలి?

ఓ సోదరి

మీ పరిస్థితి బాధాకరం. చట్ట ప్రకారం మీ కొడుక్కి మీరే నేచురల్‌ గార్డియన్‌. మీ తర్వాతే ఎవరైనా!  హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం.... మగవారెవరైనా వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి క్లాస్‌ 1 వారసులుగా వితంతు భార్య, పిల్లలు, తల్లి వస్తారు. ముగ్గురికీ ఒక్కో భాగం చెందుతుంది. మీ భర్త రాసిన పవర్‌ఆఫ్‌ అటార్నీ అతడు చనిపోయాక చెల్లదు. దాన్ని బట్టి మీ మరిది పేరున మార్చడం కుదరదు. కాగితం సరిగా చూశారా? వీలునామాలాగా రాయించుకున్నారేమో తెలియాల్సి ఉంది. ముందుగా బాబుని మీ కస్టడీకి ఇవ్వమని కేసు వేయండి. మీతోపాటు మైనర్‌ తరఫున కూడా ఆస్తి కోసం దావా వేయాల్సి ఉంటుంది. మీరు మరో పెళ్లి చేసుకున్నప్పటికీ కొడుకు మీద హక్కు ఎక్కడికీ పోదు. ముందుగా ఎవరైనా లాయర్‌ని కలవండి. ఒకవేళ మీకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేకపోతే దగ్గర్లోని లీగల్‌ సర్వీస్‌ అథారిటీ వారిని సంప్రదించండి. తప్పక న్యాయం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్