మరో పెళ్లి చేసుకుంటే... బిడ్డపై హక్కుండదా!
బాబు పుట్టిన రెండేళ్లకు నా భర్త కొవిడ్‌తో మరణించారు. అప్పటికి ఆయన పేరున మూడెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మా వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆస్తులపై పవరాఫ్ అటార్నీ మా మామయ్య తీసుకున్నారు. ఆస్తులను మా మరిది పేరు మీదకు బదలాయించారు. ఈ విషయం తెలిసి అడిగితే... పెద్దయ్యాక అవి మీ బిడ్డకే ఇస్తాం అని చెబుతున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను మరో పెళ్లి చేసుకుంటే పిల్లాడు అన్యాయమైపోతాడంటూ పంచాయతీ పెట్టారు.
బాబు పుట్టిన రెండేళ్లకు నా భర్త కొవిడ్‌తో మరణించారు. అప్పటికి ఆయన పేరున మూడెకరాల పొలం, ఇల్లు ఉన్నాయి. మా వారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆస్తులపై పవరాఫ్ అటార్నీ మా మామయ్య తీసుకున్నారు. ఆస్తులను మా మరిది పేరు మీదకు బదలాయించారు. ఈ విషయం తెలిసి అడిగితే... పెద్దయ్యాక అవి మీ బిడ్డకే ఇస్తాం అని చెబుతున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను మరో పెళ్లి చేసుకుంటే పిల్లాడు అన్యాయమైపోతాడంటూ పంచాయతీ పెట్టారు. వాడి బాధ్యత మాదే అనీ, నువ్వెప్పుడైనా చూసెళ్లొచ్చనీ చెప్పారు. కానీ, ఇప్పుడు నా ఫోన్లు కూడా ఎత్తడం లేదు. నా బిడ్డను చూసుకోనివ్వడం లేదు. నేనేం చేయాలి?
ఓ సోదరి
మీ పరిస్థితి బాధాకరం. చట్ట ప్రకారం మీ కొడుక్కి మీరే నేచురల్ గార్డియన్. మీ తర్వాతే ఎవరైనా! హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.... మగవారెవరైనా వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి క్లాస్ 1 వారసులుగా వితంతు భార్య, పిల్లలు, తల్లి వస్తారు. ముగ్గురికీ ఒక్కో భాగం చెందుతుంది. మీ భర్త రాసిన పవర్ఆఫ్ అటార్నీ అతడు చనిపోయాక చెల్లదు. దాన్ని బట్టి మీ మరిది పేరున మార్చడం కుదరదు. కాగితం సరిగా చూశారా? వీలునామాలాగా రాయించుకున్నారేమో తెలియాల్సి ఉంది. ముందుగా బాబుని మీ కస్టడీకి ఇవ్వమని కేసు వేయండి. మీతోపాటు మైనర్ తరఫున కూడా ఆస్తి కోసం దావా వేయాల్సి ఉంటుంది. మీరు మరో పెళ్లి చేసుకున్నప్పటికీ కొడుకు మీద హక్కు ఎక్కడికీ పోదు. ముందుగా ఎవరైనా లాయర్ని కలవండి. ఒకవేళ మీకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేకపోతే దగ్గర్లోని లీగల్ సర్వీస్ అథారిటీ వారిని సంప్రదించండి. తప్పక న్యాయం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
ఆరోగ్యమస్తు
- ‘కీరా దోస’తో.. కోరినంత ఆరోగ్యం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- వేడికి... సహజ మంత్రం!
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
అనుబంధం
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
యూత్ కార్నర్
- కథ వెనక కథ
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
- సైన్స్లోకంలో విహరిద్దాం రండి!
- ఆకాశం నుంచి... ఓటు అవగాహన!
- ఆ గౌను కోసం... పదివేల గంటలు!
'స్వీట్' హోం
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
వర్క్ & లైఫ్
- బాబుకి డయాబెటిస్... ఏం పెట్టాలి?
- అది అతి అయ్యిందేమో!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!
- పెదవి కొరుకుతున్నారా..!
- ఓటు కోసం... వేల మైళ్లు