Published : 04/05/2021 00:36 IST

రుచుల రహస్యాన్ని పట్టేశారు!

కేరళవాళ్లకి కొబ్బరిపుట్టులో కొమ్ముసెనగల కూర కలుపుకొని తినడం అంటే మహాఇష్టం...
కోనసీమవాసులు చింతచిగురు రొయ్యలంటే ప్రాణం పెడతారు...
దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక రుచుల్లో మనకు తెలిసినవి కొన్నే. తెలియని వాటిని వెలికితీసి .. కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఓ ముగ్గురు అమ్మాయిలు..

ఐసీసీపీ... ఇండియన్‌ కమ్యూనిటీ కుక్‌బుక్‌ ప్రాజెక్ట్‌. ఈ సైట్‌లో మనదేశంలోని ప్రఖ్యాత పాకశాలల(క్యుజీన్స్‌) గురించే కాక మనకు తెలియని, అరుదైన క్యుజీన్ల వివరాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో అమ్మమ్మల కాలం నుంచీ వస్తున్న సంప్రదాయ వంటలూ... వాటికి అమోఘమైన రుచిని ఆపాదిస్తున్న పాకశాస్త్ర రహస్యాలనీ ఇక్కడ సేకరించి పెట్టారు. భోజనప్రియులని ఆద్యంతం ఆకట్టుకునే ఈ సైట్‌కి ప్రాణం పోసింది పుణెలోని ఫ్లేమ్‌ యూనివర్సిటీకి చెందిన అనన్యాపూజారీ, ఖుషీగుప్తా, ముస్కాన్‌పాల్‌లు. చదువులో భాగంగా ఒక ప్రాజెక్టుని చేయాల్సివచ్చినప్పుడు.. అనన్యపుజారీ మనసులో మెదిలిన ఆలోచన ఇది. ‘ఇంట్లో అమ్మ చేసే వంటకాలన్నీ వాళ్ల అమ్మమ్మ నుంచి నేర్చుకున్నవే. ఆ వంటకాలు ఎక్కడ రాసున్నాయని అడిగితే మాత్రం... చిన్నప్పట్నుంచీ చూస్తూ నేర్చుకున్న వంటకాలు వాటిని ఎక్కడా రాసిపెట్టుకోం కదా! అంది. ఇలానే చాలా ఇళ్లలో వారసత్వంగా వస్తున్న ఎన్నో రుచుల రహస్యాలు ఎక్కడా రాసిపెట్టిలేదనీ, అవన్నీ నోటిమాటగానే ఒకతరం నుంచి మరొకతరానికి అందుతున్నాయని అనిపించింది. ఇక నుంచైనా ఆ పాకశాస్త్ర రహస్యాలని అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేశాం’ అంటుంది అనన్యాపూజారి. ‘కాలేజీ ప్రాజెక్టుగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నం నెమ్మదిగా ఊపందుకుంది. మొదట్లో బంధువులు, స్నేహితులు చెప్పి... స్వయంగా చేతిరాతతో రాసిచ్చిన వంటకాలని ఇక్కడ ఉంచేవాళ్లం. ఆ తర్వాత బయటవాళ్లు కూడా ఆసక్తి చూపించడంతో ఇప్పుడు మా దగ్గర ఓ పెద్ద లైబ్రరీనే ఉంది’ అంటోంది ముస్కాన్‌. ఉత్తరాది, దక్షిణాది వంటకాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వైవిధ్యమైన రుచులనీ ఈ వేదికపైకి తీసుకొచ్చిన ఈ విద్యార్థి త్రయం ఒక ఆసక్తికరమైన మ్యాప్‌ని కూడా తయారుచేసింది. ఈ మ్యాప్‌లో మనం క్లిక్‌ చేసిన చోట... ఆయా ప్రాంతాల వంటకాలు, వాటి వివరాలు మనల్ని చవులూరించేలా చేస్తాయి. ఈ క్రమంలో సింధీ, గోవా, ధింగ్రీ, ఆంగ్లో- ఇండియన్‌ వంటకాలు ఎన్నో ప్రశంసల్ని అందుకున్నాయి. కొన్ని క్యుజీన్ల వెనుక ఉన్న చరిత్రలని సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవారు communitycookbooks.wixsite.com/websiteలో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి