స్క్రీన్‌టైం తగ్గించండిలా

ఈ తరం పిల్లలకి కాలక్షేపం ఫోన్లే. మారాం చేస్తున్నారనో, పనికి అడ్డు తగులుతున్నారనో దాన్ని చేతికిచ్చి సముదాయిస్తున్నారు పెద్దలు. అయితే ఇదే అలవాటుగా మారితే మాత్రం... అది వారిపై ప్రతికూల ప్రభావం చూపించడం మాత్రం ఖాయమని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.

Published : 14 Apr 2023 00:06 IST

ఈ తరం పిల్లలకి కాలక్షేపం ఫోన్లే. మారాం చేస్తున్నారనో, పనికి అడ్డు తగులుతున్నారనో దాన్ని చేతికిచ్చి సముదాయిస్తున్నారు పెద్దలు. అయితే ఇదే అలవాటుగా మారితే మాత్రం... అది వారిపై ప్రతికూల ప్రభావం చూపించడం మాత్రం ఖాయమని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు.

* ఈ రోజుల్లో జీవితం అంతా ఉరుకుల పరుగుల మీదనే సాగుతోంది. పొద్దున లేస్తే ఆఫీసు, వ్యాపారం అంటూ తలో పనిలో తలమునకలవుతుంటాం. ఈ బిజీలో పిల్లలతో గడిపే సమయం ఉండటం లేదు చాలామందికి. ప్రధానంగా చిన్నారులు గ్యాడ్జెట్స్‌కి అలవాటు పడటానికి ప్రధాన కారణం ఇదే. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు....ఇంట్లో పెద్దలు కూడా వాటి వాడకాన్ని తగ్గించాలి. ఏ కాస్త సమయం దొరికినా వారు చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం, వారి స్నేహితుల గురించి వాకబు చేయడం వంటివన్నీ ఆ బుజ్జాయిలకు ఉత్సాహాన్నిచ్చేవే. స్క్రీన్‌ అలవాటుని తప్పించేవే.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఐదేళ్ల లోపు చిన్నారులు... రోజులో గంటకు మించి గ్యాడ్జెట్స్‌ని వాడటం అంత మంచిది కాదట. అందుకే ఎంత వరకూ స్క్రీన్‌ టైమ్‌ తగ్గించగలిగితే అంత మంచిది. పిల్లలు... పదే పదే వీడియోలు చూడాలనీ మారాం చేస్తుంటే...వారికిచ్చే ట్యాబ్‌లూ, ఫోనుల్లో ఫిల్టర్స్‌ పెట్టండి. మీరు లేనప్పుడు చూస్తున్నారన్న భయం ఉంటే వాటికి చైల్డ్‌ లాక్‌లు వేసేయండి. కొంతవరకూ అదుపులో ఉంటారు. ఇక, మీ పిల్లల స్క్రీన్‌ సమయాన్ని తగ్గించేందుకు రోజూ కచ్చితమైన సమయాన్ని నిర్దేశించండి. తర్వాత క్రమంగా ఈ టైమ్‌ని కూడా తగ్గిస్తూ రావాలి.

* వినోదం అంటే డిజిటల్‌ గేమ్స్‌ కాదనే విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడండి. వారిని ఆరుబయట ఆడించండి. మీకూ చక్కని శారీరక శ్రమ అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని