Winter Tips : కర్లీ హెయిర్‌ సంరక్షణ ఇలా!

జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ముఖ్యంగా శీతాకాలంలో వీచే చలిగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. అదే కర్లీ హెయిర్ ఉన్న వారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

Published : 13 Dec 2023 12:14 IST

జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ముఖ్యంగా శీతాకాలంలో వీచే చలిగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. అదే కర్లీ హెయిర్ ఉన్న వారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి ఈ చిట్కాలు కూడా ఉపయోగపడతాయి.

సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీళ్లు తాగాలనిపించదు. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా చర్మమే కాదు.. జుట్టూ తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. అందుకే రింగుల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ తగినంత మొత్తంలో నీళ్లు తాగాలి.

అలాగే కనీసం ఏడెనిమిది గంటలు సుఖ నిద్రకు ఉపక్రమించాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలు దూరమై.. ప్రశాంతత దరిచేరుతుంది. ఇదీ కర్లీ హెయిర్‌ ఆరోగ్యానికి ముఖ్యమే!

అప్పుడప్పుడూ కొన్ని చుక్కల హెయిర్ సీరంను రాసుకోవడం వల్ల కూడా.. చల్లటి వాతావరణం నుంచి కర్లీ హెయిర్‌ను కాపాడుకోవచ్చు.

రింగుల జుట్టు ఉన్న వారు చివర్లు చిట్లే సమస్యతో బాధపడుతుంటారు. దానివల్ల కేశాలు నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా ఎదగడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది.

జుట్టుకు తేమనందించడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. కాబట్టి వారానికి రెండుసార్లు కలబంద గుజ్జును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

జుట్టు తేమను కోల్పోకుండా చేయడంలో తేనె పాత్ర కీలకం. అందుకే జుట్టుకు పోషణనందించే కండిషనర్లు, డీప్ కండిషనర్లతో పాటు క్లెన్సర్‌లలోనూ కాస్త తేనెను కలుపుకొని అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్