పడుకునే ముందు ఐ మేకప్ తీసేస్తున్నారా? లేదా?
మేకప్.. ఇది మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్ విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ బద్ధకంతో కంటికి వేసుకున్న మేకప్ తొలగించకపోతే మాత్రం కళ్ల కింద నల్లటి వలయాలు, కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు. మరి, ఇంతకీ పడుకునే ముందు ఐ మేకప్ తొలగించుకోకపోతే ఇంకా ఎలాంటి సమస్యలొస్తాయి? దీన్ని సరైన పద్ధతిలో తొలగించుకోవడమెలా? రండి.. తెలుసుకుందాం..!
మేకప్.. ఇది మనల్ని రోజంతా అందంగా కనిపించేలా చేసినా రాత్రి పడుకునే ముందు మాత్రం దీన్ని పూర్తిగా తొలగించక తప్పదు. లేదంటే వివిధ రకాల చర్మ సౌందర్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐ మేకప్ విషయంలోనూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఒకవేళ బద్ధకంతో కంటికి వేసుకున్న మేకప్ తొలగించకపోతే మాత్రం కళ్ల కింద నల్లటి వలయాలు, కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు. మరి, ఇంతకీ పడుకునే ముందు ఐ మేకప్ తొలగించుకోకపోతే ఇంకా ఎలాంటి సమస్యలొస్తాయి? దీన్ని సరైన పద్ధతిలో తొలగించుకోవడమెలా? రండి.. తెలుసుకుందాం..!
ముఖానికి మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా.. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు తమ కళ్లను మాత్రం మస్కారా, ఐ-లైనర్, కాటుక.. వంటి విభిన్నమైన బ్యూటీ ఉత్పత్తులతో తీర్చిదిద్దుకుంటున్నారు. తద్వారా అచ్చం మేకప్ లాంటి లుక్‌ని సొంతం చేసుకొని అందంగా మెరిసిపోతున్నారు. అయితే ఇక్కడి వరకు చూపించినంత శ్రద్ధ.. రాత్రి పడుకునే ముందు దీన్ని తొలగించడంలో మాత్రం తీసుకోరనే చెప్పాలి. వివిధ పనుల రీత్యా అలసిపోయి ఇంటికి చేరుకోవడం, ఆలస్యమవడం.. ఇలా కారణమేదైనా రాత్రయ్యే సరికి ఒక రకమైన బద్ధకం ఆవహిస్తుంటుంది. దీంతో ఏదో పైపైన మొహం కడిగేసుకొని మేకప్ సంగతి రేపు చూసుకుందాంలే అనుకుంటుంటారు. అయితే ఈ అజాగ్రత్తే లేనిపోని కంటి సమస్యల్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు నిపుణులు.
‘పింక్ ఐ’ గురించి తెలుసా?
సాధారణంగానే మేకప్ వేసుకునే క్రమంలో కంటికి సంబంధించిన మేకప్ ఉత్పత్తుల్లోని అవశేషాలు, రసాయనాలు కంటి ఉపరితలంపై పేరుకుపోతాయి. ఇక రాత్రి పూట కూడా దాన్ని తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇది అప్పటికప్పుడు ప్రతికూల ప్రభావం చూపకపోయినా కొన్ని రోజుల తర్వాత కళ్లలో దురద, ఎరుపెక్కడం.. వంటి కంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అంతేకాదు.. దీర్ఘకాలంలో ఇది పింక్ ఐ (కనుగుడ్డు చుట్టూ వాపు/ఇన్ఫెక్షన్ రావడం) సమస్యకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. కాబట్టి కళ్లకు మేకప్ ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు.
చర్మ అలర్జీలు తప్పవు!
అలసిపోయామనో లేదంటే రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నామనో.. కంటి మేకప్ తొలగించుకోకుండా ఏదో పైపైన శుభ్రం చేసుకొని పడుకుంటుంటారు కొంతమంది అమ్మాయిలు. దీనివల్ల రాత్రి మనకు తెలియకుండానే కళ్లు దురద పుట్టచ్చు.. నలపచ్చు.. దాంతో మేకప్ కళ్లలోకి చేరుతుంది.. అలాగే అటూ ఇటూ దొర్లే క్రమంలో మేకప్ దిండ్లు, బెడ్‌షీట్స్‌కి సైతం అంటుకుంటుంది. అక్కడి నుంచి చర్మం పైకి చేరి లేనిపోని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ తలెత్తకూడదంటే కాస్త ఓపిక చేసుకొని ఐ మేకప్‌ని తొలగించుకోవడం మంచిది.
మస్కారా తొలగిస్తున్నారా?
కనురెప్పల్ని తీర్చిదిద్దుకోవడానికి, వాటిని వంపులు తిరిగేలా చేయడానికి మస్కారా వాడడం మనకు అలవాటే! అయితే ఇది రెప్పలకు మందంగా అంటుకొని.. వాటిని అలాగే బిగుసుకుపోయేలా చేస్తుంది. తద్వారా కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోతాయి. ఇక రాత్రంతా కూడా మస్కారా పెట్టుకొని ఉండడం వల్ల రెప్పలకు తేమ అందక అవి తమ సహజత్వాన్ని కోల్పోతాయి. పెళుసుబారిపోయి తెగిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇదిలాగే కొనసాగితే కనురెప్పలు క్రమంగా పల్చబడి కంటి అందం దెబ్బతింటుంది. కాబట్టి రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత మస్కారాను పూర్తిగా తొలగించుకోవడం మంచిది.
నల్లటి వలయాలొస్తాయ్!
రోజంతా అలసిపోయిన శరీరం రాత్రి పడుకున్నప్పుడు విశ్రాంతి తీసుకున్నట్లే.. కళ్లూ రాత్రి పూట రిలాక్సవుతాయి. ఈ క్రమంలో కళ్ల చుట్టూ ఉండే చర్మకణాలు యాక్టివేట్ అయి అక్కడి చర్మాన్ని రిపేర్ చేసుకుంటాయి. అయితే రాత్రి పూట మేకప్ తొలగించకుండా అలాగే పడుకోవడం వల్ల దీనిలోని రసాయనాలు ఈ కణాల పనితీరును అడ్డుకుంటాయి. తద్వారా కళ్ల కింద నల్లటి వలయాలు, కంటి చుట్టూ వాపు.. వంటి సమస్యలొస్తాయి. ఫలితంగా చిన్న వయసులోనే వృద్ధ్యాప్య ఛాయలు అలుముకుంటాయి. కాబట్టి రాత్రి పూట కళ్లకు వేసుకున్న మేకప్ తొలగించి వాటికి కాస్త సాంత్వన ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు.
కళ్లలోకి వెళ్లకుండా తొలగించుకోవాలి!
కంటికి మేకప్ వేసుకోవడానికే కాదు.. తొలగించడానికీ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఐ మేకప్ రిమూవింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఐ మేకప్ రిమూవర్స్/క్లెన్సర్లకు కొదవే లేదు. అయితే వీటితో పని లేకుండా ఇంట్లోనే సులభంగా కంటి మేకప్‌ను తొలగించుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
* సాధారణ మేకప్‌ను తొలగించుకునేందుకు ఉపయోగించే కొబ్బరి నూనె కంటి మేకప్‌ను తొలగించడానికీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కాటన్ ప్యాడ్‌పై కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి.. దాన్ని కనురెప్పలు, కంటి చుట్టూ ఉండే చర్మంపై నెమ్మదిగా రుద్దుతూ మేకప్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనురెప్పల వద్ద కాటన్ స్వాబ్‌ను ఉపయోగిస్తే.. మేకప్ కంటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.
* జెల్/పౌడర్/క్రీమ్ ఆధారిత మేకప్ ఉత్పత్తుల్ని పూర్తిగా తొలగించడంలో పెట్రోలియం జెల్లీది కీలక పాత్ర. ఈ క్రమంలో కొద్దిగా జెల్లీని కంటి చుట్టూ అప్లై చేసి.. చూపుడు వేలితో గుండ్రంగా రుద్దుతూ మేకప్‌ను తొలగించుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ బాల్‌తో ఆ ప్రదేశంలో తుడిచేస్తే సరిపోతుంది.
* కొద్దిగా బేబీ ఆయిల్‌ను కాటన్ ప్యాడ్‌పై వేసి.. దాంతో కళ్ల చుట్టూ నెమ్మదిగా, గుండ్రంగా రుద్దుతూ కూడా మేకప్‌ను సులభంగా తొలగించుకోవచ్చు.
* కనురెప్పలకు అప్లై చేసుకున్న మస్కారాను తొలగించుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాటన్ స్వాబ్‌ను కొబ్బరి నూనె/బేబీ ఆయిల్లో ముంచి.. దాంతో మస్కారా అప్లై చేసుకున్నట్లుగా కింది నుంచి పై దిశగా మేకప్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా మస్కారా పూర్తిగా తొలగిపోవడంతో పాటు కంట్లోకి వెళ్లకుండా కూడా ఉంటుంది.
* మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోయినా కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే వాటిని వాడిన ప్రతిసారీ బేబీ వాష్, లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసి.. పొడిగా ఆరబెట్టాలి. ఇక వాటి బ్రిజిల్స్ పాతబడిపోతే.. వెంటనే మార్చేయడం లేదంటే కొత్త బ్రష్‌లను కొనడం మంచిది.
ముఖానికి పట్టించినట్లే కొంతమంది కంటికీ దట్టంగా మేకప్ వేస్తుంటారు. దానివల్ల కంటి సమస్యల్ని కోరికోరి కొని తెచ్చుకున్నట్లే! కాబట్టి ఐ మేకప్ ఎంత సింపుల్‌గా, తక్కువగా వేసుకుంటే అందం అంతగా ఇనుమడిస్తుంది.. కంటి సమస్యలు రాకుండానూ జాగ్రత్తపడచ్చు. ఒకవేళ ఈ సమస్యలు మరీ తీవ్రమైతే మాత్రం సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం మర్చిపోవద్దు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
ఆరోగ్యమస్తు
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
- పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
యూత్ కార్నర్
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
'స్వీట్' హోం
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
వర్క్ & లైఫ్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!