close
గుస‌గుస‌లు
కమల్‌ హాసన్‌కు ప్రత్యర్థిగా అనిల్‌ కపూర్‌!

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ -2’. తెలుగులో ‘భారతీయుడు-2’గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌.. కమల్‌ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న  శంకర్‌, అనిల్‌ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. అనిల్‌కు శంకర్‌ సీన్ వివరిస్తున్నప్పటి ఓ ఫొటోను చిత్ర బృందం సన్నిహిత వర్గాలు పోస్ట్‌ చేశాయి. ఇందులో ఆయన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నాయి. 

తొలుత ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ను అనుకున్నారు. ఈ విషయాన్ని కమల్‌ ధ్రువీకరించారు కూడా. కొన్ని కారణాల వల్ల ఈచిత్రం ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకొన్నారు. దీంతో ప్రతినాయక పాత్రలో అక్షయ్‌కుమార్‌ను తీసుకోవాలని శంకర్‌ భావించారు. అదీ కుదరకపోవడంతో అనిల్‌కు ఆ అవకాశం వచ్చిందని చిత్రబృందం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. ఇందులో కాజల్‌ కథానాయిక. సిద్దార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, విద్యుత్ జమ్వాల్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.