close
ఇంటర్వ్యూ
మమ్మల్ని జోకర్స్‌లా చూస్తుంటారు!

ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయో చెప్పండి?
చిత్ర పరిశ్రమపై దర్శకుడి ఆగ్రహం

ముంబయి: చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రాలకు విలువే లేదని దర్శకుడు రాజ్‌ శాండిల్యా మండిపడ్డారు. ‘డ్రీమ్‌గర్ల్‌’ చిత్రంలో ఆయన దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఆయుష్మాన్ కాల్‌ గర్ల్‌ ‘పూజ’ అవతారం ఎత్తి.. ట్రైలర్‌లో అమ్మాయి గొంతుతో అనేక మంది పురుషులతో మాట్లాడుతూ వినోదం పండించారు. ఇప్పటి వరకు 2.52 కోట్ల మందికిపైగా దీన్ని వీక్షించడం విశేషం.

క్రెడిట్‌ ఇవ్వడం లేదు

కాగా కామెడీ సినిమాలకు బాలీవుడ్‌ విమర్శకులు సరైన గౌరవం ఇవ్వడం లేదని రాజ్‌ శాండిల్యా ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘చిత్ర పరిశ్రమలో కామెడీ కథాంశంతో వచ్చిన సినిమాల్ని సెకండ్‌ క్లాస్‌ సిటిజెన్‌లా ట్రీట్‌ చేస్తుంటారు. ఎన్ని కామెడీ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయో నాకు చెప్పండి? రచన విషయానికి వస్తే కామెడీ స్క్రిప్టు రాయడం ఎంతో కష్టం. కానీ మాకు ఎప్పుడూ సరైన క్రెడిట్‌ ఇవ్వలేదు. కామెడీ ఎవరైనా చేయగలరని అనుకుంటుంటారు. కానీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ను సరైన రీతిలో వాడి,  ప్రజల్ని నవ్వించడం చాలా కష్టమనే విషయాన్ని మరిచిపోతున్నారు’.

తగిన గౌరవం ఇవ్వలేదు
‘ఛార్లీ ఛాప్లిన్‌ను కామెడీకి గురువుగా భావిస్తాం. దాదాపు 25 ఏళ్లు పనిచేసిన తర్వాత ఆయన ఐకాన్‌ అయ్యారు. ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అప్పుడు ప్రజలు ఆయన్ను మెచ్చుకుంటూ 12 నిమిషాలపాటు చప్పట్లు కొట్టారు. ఎందుకో మీకు తెలుసా?.. ఆయన ఏళ్ల తరబడి ప్రజలకు వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. కాబట్టి ఆయన దానికి అర్హుడని ఫీల్‌ అయ్యారు. గోవింద, డేవిడ్‌ ధావణ్‌లాంటి నటులు కమర్షియల్‌ సక్సెస్‌లు అందించారు. కానీ వారిని ఎప్పుడూ అవార్డుతో సత్కరించలేదు, వారి అర్హతకు తగినట్లు గౌరవించలేదు’.
చూసి.. మరిచిపోతున్నారు
‘మమ్మల్ని (కమెడియన్స్‌, కామెడీ ఫిల్మ్‌మేకర్స్‌) జోకర్స్‌లా చూస్తుంటారు. ఎవరూ జోకర్స్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వరు. జీవితంలో వినోదం కోసం మేం అందరికీ కావాలి, ఆ క్షణం సినిమాను చూసి తర్వాత మరిచిపోతుంటారు. మా పనిని గుర్తించి, కాస్త గౌరవిస్తే బాగుంటుంది’ అని రాజ్‌ అన్నారు. ఆయన టీవీ షో ‘కామెడీ సర్కస్‌’కు కథ అందించారు. ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’, ‘ఫ్రీకీ అలీ’, ‘భూమి’ తదితర సినిమాల కోసం ఆయన పనిచేశారు.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.