పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!

నేను ఎంఏ చదివాను. లెక్చరర్‌ కావాలని కలలు కన్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే పెళ్లైంది. నా భర్త పెళ్లికి ముందు నేను జాబ్‌ చేయడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు వద్దంటున్నాడు.

Published : 27 Mar 2024 12:51 IST

నేను ఎంఏ చదివాను. లెక్చరర్‌ కావాలని కలలు కన్నాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే పెళ్లైంది. నా భర్త పెళ్లికి ముందు నేను జాబ్‌ చేయడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. ‘మనకు సంపాదించాల్సిన అవసరం ఏముంది? మా అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో.. చాలు’ అంటున్నాడు. రోజంతా ఇంటి పని.. వచ్చి వెళ్లే వారిని చూసుకోవడంతోనే సరిపోతుంది. చాలా నిరాశగా ఉంది. నా బాధ తనకు అర్థం కావడం లేదు. ఇలాగే ఇంకొన్నాళ్లు ఉంటే పిచ్చెక్కిపోతుందేమోనని భయంగా ఉంది. నా భర్తకు నా బాధ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు ఉన్నత చదువులు చదివారు.. సొంత కాళ్లపై నిలబడాలని అనుకున్నారు. కేవలం చదువు మాత్రమే ఉండాలంటే డిగ్రీతోనే ఆపేసేవారు. అలాగే పెళ్లికి ముందు నుంచే మీరు లెక్చరర్‌ కావాలని అనుకున్నారు. ఇది మంచి విషయం. ఇదే విషయం పెళ్లికి ముందే మీ భర్తకు చెప్పినప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మాట మారుస్తున్నారని అంటున్నారు. దీనిని బట్టి అతడు మిమ్మల్ని నియంత్రిస్తున్నాడని స్పష్టమవుతోంది.

అయితే ఉద్యోగం అనేది కేవలం సంపాదన కోసం మాత్రమే చేసేది కాదు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం మెరుగవుతుంది. ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. నలుగురితో మాట్లాడతారు.. కాబట్టి సామాజిక అవగాహన పెరుగుతుంది. ఈ విషయాలన్నీ మీ భర్తకు తెలియజేయండి. ‘నాకిలా అనిపిస్తోంది.. జీవితం చాలా నిరాశగా ఉంది.. నా లక్ష్యాలు ఇవి కావు.. నా కెరీర్‌ను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నా.. నాకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవాలనుంది.. అందుకు కొంత సమయం కావాలి’ ఇలా మీ మనసులోని ఆలోచనలన్నీ మీ భర్తకు తెలియజేయండి. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే కౌన్సెలింగ్‌ నిపుణుల దగ్గరకు వెళ్లి మీ సమస్యను వివరించండి. వారు మీ భర్తకు అర్థమయ్యేలా చెబుతారు. అప్పుడు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఓ గాడిన పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్