సౌందర్య పోషణకు.. ‘పసుపు నూనె’!

సౌందర్య పరిరక్షణలో పసుపు పాత్ర కీలకం. అలాగే అందానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వాడడం కూడా పరిపాటే! ఈ క్రమంలో పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన అత్యవసర నూనె వల్ల సైతం సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

Published : 24 Sep 2023 13:07 IST

సౌందర్య పరిరక్షణలో పసుపు పాత్ర కీలకం. అలాగే అందానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌ను వాడడం కూడా పరిపాటే! ఈ క్రమంలో పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన అత్యవసర నూనె వల్ల సైతం సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

మొటిమలకు విరుగుడు!

సీబమ్‌ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తై జిడ్డుగా మారుతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. సీబమ్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి.. జిడ్డుదనాన్ని తొలగించడంలో పసుపు నూనె కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా మొటిమల బెడద తగ్గుతుంది.

ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. చర్మానికి తేమనందించి పొడి చర్మ సమస్యను దూరం చేస్తాయి.

ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేసి.. నవ యవ్వనంగా ఉంచేలా ఈ నూనె తోడ్పడుతుంది.

కురులకు..

ఈ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల చర్మానికే కాదు.. కురులకు కూడా చక్కని ప్రయోజనాలు చేకూరతాయి. చుండ్రుని నివారించడంతో పాటు జుట్టు రాలడాన్ని అరికట్టడంలోనూ ఇది ఉపకరిస్తుంది. అలాగే దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల ఇవి కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. దీనికోసం ఈ నూనెను నేరుగా కాకుండా మనం ఉపయోగించే సాధారణ నూనె (కొబ్బరినూనె, బాదంనూనె..)లో కొన్ని చుక్కలు కలుపుకొని ఉపయోగించాలి.

ఇతర ప్రయోజనాలు..

ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి వాపు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.

పాదాల్లో పగుళ్లను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. దీనికోసం కొబ్బరినూనె లేదా ఆముదంలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమంతో రోజూ పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే పగుళ్లు తగ్గడంతో పాటు పాదాలు మృదువుగా మారడం మనం గమనించవచ్చు.

ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.

కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీనిని వినియోగిస్తారు.

గమనిక: పసుపు నూనె అత్యవసర నూనె. కాబట్టి దీన్ని నేరుగా చర్మానికి, కుదుళ్లకు అప్లై చేయకూడదు. కొబ్బరి, జొజోబా, ఆలివ్‌, రోజ్‌హిప్‌.. వంటి క్యారియర్‌ ఆయిల్స్‌లో ఈ నూనెను ఐదారు చుక్కలు కలుపుకొని ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్