Gut Health: ఈ పదార్థాలతో పొట్ట ఆరోగ్యానికి చేటే..!

మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పొట్టను ‘సెకండ్ బ్రెయిన్‌’ అని అంటుంటారు. ఎందుకంటే మన మెదడులో ఒక ఆలోచన వస్తే మొదట స్పందించేది పొట్ట మాత్రమే. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుంది. ఎవరిమీదనైనా కోపం వస్తే ఎసిడిటీ వస్తుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యాన్ని....

Published : 27 Jun 2023 12:24 IST

మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పొట్టను ‘సెకండ్ బ్రెయిన్‌’ అని అంటుంటారు. ఎందుకంటే మన మెదడులో ఒక ఆలోచన వస్తే మొదట స్పందించేది పొట్ట మాత్రమే. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుంది. ఎవరిమీదనైనా కోపం వస్తే ఎసిడిటీ వస్తుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వాలంటున్నారు నిపుణులు. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందామా...

చక్కెర పదార్థాలు...
పొట్టలో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. కానీ, చెడు బ్యాక్టీరియా వల్ల గ్యాస్‌, అల్సర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగించి చెడు బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తుంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి, పొట్టలోని బ్యాక్టీరియాను అస్తవ్యస్తం చేయగల సామర్థ్యం ఉన్న రిఫైన్డ్ షుగర్‌, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

కృత్రిమ చక్కెరలు..
చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదన్న కారణంతో కొంతమంది వాటికి బదులుగా కృత్రిమ చక్కెరలను ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంటాయి. పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపించడమే కాకుండా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తుంటాయి. కాబట్టి, వీటికి కూడా దూరంగా ఉండడం మంచిది.

ఎక్కువగా ఫ్రై చేస్తే..
చాలామంది ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఇవి జీర్ణమవ్వడానికి అధిక సమయం పడుతుంది. దానివల్ల పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండడం మంచిది.

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌...
కొంతమంది ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఈ ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను అసమతుల్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్