కొత్తందాల క్రాప్‌ టాప్‌

వేసవి వచ్చేసింది... వస్తూ వస్తూ తనతో పాటు ఓ నయా ట్రెండ్‌నీ వెంటపెట్టుకుని తెచ్చేసింది. అదే క్రాప్‌టాప్‌-పలాజో జోడీ! ఆధునికంగా కనిపించాలనుకునే అమ్మాయిలే కాదు.

Published : 16 Mar 2024 01:40 IST

వేసవి వచ్చేసింది... వస్తూ వస్తూ తనతో పాటు ఓ నయా ట్రెండ్‌నీ వెంటపెట్టుకుని తెచ్చేసింది. అదే క్రాప్‌టాప్‌-పలాజో జోడీ! ఆధునికంగా కనిపించాలనుకునే అమ్మాయిలే కాదు...పెళ్లిళ్ల వంటి వేడుకల్లో సంప్రదాయంగా సందడి చేయాలనుకునే వారందరికీ ఇది భలేగా నప్పేస్తుంది. ఇటు సౌకర్యంగానూ, అటు స్టైలిష్‌గానూ ఉండటం వల్ల అమ్మాయిలు మనసు పడుతున్నారు. వీటిల్లో లేత రంగులూ, కాంట్రాస్ట్‌ డిజైన్లూ, ఆడంబరంగా ఆకట్టుకునే ఎంబ్రాయిడరీ సొగసులు...ఇలా ఒకటేమిటి మీకు నచ్చినట్లుగా వచ్చి మిమ్మల్ని మెప్పించడానికి సిద్ధమైపోయాయి. మరింకెందుకాలస్యం... మీరూ ఒకటి ప్రయత్నించి చూడండి. వారెవ్వా అనకుండా ఉండలేరు...మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్