అవాంఛిత రోమాలకు సీతాఫలం ఆకు

అవాంఛిత రోమాలు... ఇది చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. చేతులు, పై పెదవిపై, చుబుకం కింద, చెంపలకు పక్కగా  ఈ సమస్య ఎదురవుతుంది. ఇది మహిళల్లో అధికంగా కనిపించేందుకు కారణం పీసీఓడీ.  శరీరంపై ఎవరికైనా సన్నని నూగులా ఇవి ఉండటం సహజం...

Updated : 08 Dec 2022 19:56 IST

ఇంటివైద్యం

అవాంఛిత రోమాలు... ఇది చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య. చేతులు, పై పెదవిపై, చుబుకం కింద, చెంపలకు పక్కగా  ఈ సమస్య ఎదురవుతుంది. ఇది మహిళల్లో అధికంగా కనిపించేందుకు కారణం పీసీఓడీ.  శరీరంపై ఎవరికైనా సన్నని నూగులా ఇవి ఉండటం సహజం. పీసీఓడీ సమస్యలో మాత్రం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువ కావడంతో శరీరంపై రోమాల పెరుగుదల అధికంగా కనిపిస్తుంది. కొందరిలో ఈ హార్మోన్‌ తక్కువస్థాయిలో ఉన్నా సమస్య ఎదురవుతుంది. చంటిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా నూనె రాసి సున్నిపిండి నలుగు పెట్టే అలవాటు తగ్గినా... లేకపోయినా ఈ సమస్య రావచ్చు.


ఏం చేయాలి

నిత్యం నువ్వుల నూనె శరీరానికి రాసి, మర్దన చేసుకోవాలి. ఆ నూనె శరీరంలో ఇంకిన తరువాత సెనగపిండి, పసుపు కలిపిన మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. చిన్నప్పటి నుంచి  ఈ పద్ధతిని అనుసరిస్తే వీటిని నిరోధించుకోవచ్చు. ముఖంపై రోమాలున్నచోట ఇలాగే చేయాలి. నిదానంగానైనా సరే  సమస్య చాలామటుకు అదుపులోకి వస్తుంది. 


* నిమ్మరసానికి కాసిని నీరు, పంచదార కలిపి చిక్కగా అయ్యేవరకు పొయ్యిమీద పెట్టి, తరువాత దింపేయాలి. కాస్త గోరువెచ్చగా అయ్యాక ఈ మిశ్రమాన్ని రోమాలున్న చోట పూతలా వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక ఆ పొరని తీసేస్తే చాలు. అవాంఛిత రోమాలను తొలగిపోతాయి.


* పాలు, పసుపు, సెనగపిండి కలిపిన పేస్టును రోమాలున్నచోట పూయాలి. ఎండిన తరువాత బాగా రుద్ది కడిగేస్తే చాలు. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.


* సీతాఫలం ఆకులను నూరి ముద్ద చేయాలి. సమస్య ఉన్నచోట దీన్ని రుద్ది ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి.


* నాగకేసరాల చూర్ణం ఆవనూనెలో కలిపి వారం రోజులు ఎండలో ఉంచితే ముద్దలా తయారవుతుంది. దీన్ని రోమాలున్న ప్రాంతంలో లేపనంలా వేయాలి. పావుగంట తరువాత కడిగేయాలి. వారానికి ఒకసారి చేస్తుంటే అవాంఛిత రోమాల పెరుగుదల ఆగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్