వర్కవుట్‌ అయ్యిందా?

ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఇప్పుడంతా జిమ్‌లకు వెళ్తున్నారు. ఎక్కువ సమయం వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి కసరత్తులు చేయాలి? ఎలా చేయాలి అన్నదే కాదు.. వర్కవుట్ల తర్వాత కొన్ని చిట్కాలు...

Published : 03 Sep 2021 02:57 IST

ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఇప్పుడంతా జిమ్‌లకు వెళ్తున్నారు. ఎక్కువ సమయం వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి కసరత్తులు చేయాలి? ఎలా చేయాలి అన్నదే కాదు.. వర్కవుట్ల తర్వాత కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే...

వ్యాయామం తర్వాత శరీర భాగాలను తప్పకుండా స్ట్రెచ్‌ చేయాలి. ఇలా ఒక్కో భాగాన్ని ముప్ఫై సెకన్ల పాటు చేయడం వల్ల కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

* కసరత్తులు చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. అందుకే వర్కవుట్స్‌ పూర్తయ్యాక నీరు తాగాలి. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుతుంది. డీహైడ్రేషన్‌ సమస్య ఎదురుకాదు.
* తీవ్రంగా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంపై ఒత్తిడి అధికమవుతుంది. అందుకే వ్యాయామం తర్వాత కొన్ని నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. దీంతో శరీరంపై ఒత్తిడి తగ్గుతుంది. ఆయాసం, గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి చేరతాయి. కొంత సేపటి తర్వాత శరీరం చురుగ్గా మారుతుంది. 

* శరీరం మొత్తం చెమటగా మారి, దుస్తులన్ని తడిచిపోతాయి. ఆపై స్నానం చేయడం మాత్రం మరువొద్దు. చెమటతో కూడిన దుస్తులు ఎక్కువ సేపు ధరించడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
* వ్యాయామం తర్వాత శరీరం అలసిపోతుంది. మళ్లీ శక్తి కావాలంటే ఏదో ఒకటి తప్పకుండా తినాలి. దీన్ని పోస్ట్‌ వర్కింగ్‌ మీల్‌ అంటారు. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎంచుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్