ప్రతి కొవ్వూ చెడ్డదేనా?

బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే అమ్మాయిలు ఎంచుకునేది లోఫ్యాట్‌ డైట్‌. లేదా కొవ్వు పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయడం. ఇది తప్పంటున్నారు...

Published : 24 Sep 2021 01:02 IST

బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే అమ్మాయిలు ఎంచుకునేది లోఫ్యాట్‌ డైట్‌. లేదా కొవ్వు పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేయడం. ఇది తప్పంటున్నారు నిపుణులు. శరీరానికీ రోజువారీ కొంత కొవ్వు అవసరం. కాబట్టి.. చెడ్డ వాటిని పక్కన పెడితే చాలు. మరి మంచివేంటి? చదివేయండి.

* మోనోఅన్‌ శాచురేటెడ్‌: ఆలివ్‌, రైస్‌ బ్రాన్‌, వేరుశనగ వంటి వెజిటబుల్‌ ఆయిల్స్‌, బాదం, కాజూ, పిస్తాల్లో ఈ రకమైన ఫ్యాట్లు ఎక్కువ. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సాయపడతాయి.

* ఒమేగా-3: చేపలు, అవిసె గింజెలు, వాల్‌నట్స్‌ల్లో ఇవి ఎక్కువ.

* ఒమేగా-6: నువ్వులు, సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఇవి ఎక్కువ. పొద్దుతిరుగుడు, నువ్వులు, గుమ్మడి విత్తనాల్లో పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఎక్కువ. కనీసం వారానికోసారైనా వీటిని తీసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్