చిట్టి మెదడు చురుకుగా...

తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి శిశువు మెదడు ఎదుగుదల మొదలవుతుంది. ప్రసవానంతరం ఈ ప్రక్రియ వేగవంతమై మూడేళ్లవరకు ఇది కొనసాగుతుంది. మాట్లాడటం, ఇతరులతో అనుబంధాన్ని పెంచుకోవడం వంటి నైపుణ్యాలను...

Published : 21 Oct 2021 00:40 IST

ల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి శిశువు మెదడు ఎదుగుదల మొదలవుతుంది. ప్రసవానంతరం ఈ ప్రక్రియ వేగవంతమై మూడేళ్లవరకు ఇది కొనసాగుతుంది. మాట్లాడటం, ఇతరులతో అనుబంధాన్ని పెంచుకోవడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలుపెడతారు. వయసు పెరుగుతున్నకొద్దీ వారి మెదడు మరింత చురుకుగా మారేలా, జ్ఞాపకశక్తిని పెంచేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలంటున్నారు వైద్యనిపుణులు. అదెలాగో సూచిస్తున్నారు.

క్రీడలు... తల్లిదండ్రులు కొంతసమయాన్ని పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించాలి. జ్ఞాపకశక్తిని పెంచే క్విజ్‌, క్రాస్‌ వర్డ్స్‌ వంటి గేమ్స్‌ను ఆడించాలి. ఇవన్నీ వారిలో నైపుణ్యాలను మెరుగు పరుస్తాయి. చిన్నచిన్న ప్రశ్నలు వేసి సమాధానాలు వచ్చే వరకు ఎదురుచూడాలి. తప్పు చెబితే సరిదిద్దాలి, సరిగా చెబితే అభినందించాలి. ఇవన్నీ వారి జ్ఞాపకశక్తిని పెరిగేలా చేస్తాయి. చిన్నప్పటి నుంచి ఈతరహా అలవాట్లు వారిని చదువులోనూ ముందుంచుతాయి.

పఠనం... చదువుకు సంబంధించినవి మాత్రమే కాకుండా, కథల పుస్తకాలను చదవడం పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అది వారిలో పరిజ్ఞానాన్ని పెంపొందేలా చేస్తాయి. పుస్తకపఠనంపై ఆసక్తి పెరిగేలా చేస్తే చాలు. అది ఏ విషయాన్నైనా..ఎ ంతకాలమైనా వారు మరవలేనంతగా మనసులో నిక్షిప్తమవుతుంది. వారు పూర్తి చేసిన పుస్తకంపై అభిప్రాయాన్ని చెప్పమని విశ్లేషించడం అలవరిస్తే చాలు. వారిలో ఆసక్తి పెరుగుతుంది.

సంగీతం... బాల్యం నుంచి సంగీతాన్ని వినడం పిల్లలకు అలవరిస్తే, వారిలో పలురకాల నైపుణ్యాలు పెరగడానికి అది తోడ్పడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇది వారి మానసిక ఉద్వేగాలను నియంత్రించుకునే శక్తిని నేర్చుకునేలా చేస్తుంది. అలాగే అలవాట్లు, కొత్త విషయాలను నేర్పడంతోపాటు పోషకవిలువలున్న ఆహారం పిల్లల్లో శారీరక, మానసికారోగ్యాన్ని అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్