చిక్కుల్ని తగ్గించే అవిసె గింజలు!

ఇంటిల్లిపాది ఆరోగ్య సంరక్షణకోసం తాపత్రయ పడే ఆడవాళ్లు... తమలో ఉన్న పోషక లోపాన్ని గమనించుకోరు. ఇలాంటివారు రోజూ ఓ చెంచా అవిసెగింజల్ని తింటే ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చు.

Updated : 25 Oct 2023 03:42 IST

ఇంటిల్లిపాది ఆరోగ్య సంరక్షణకోసం తాపత్రయ పడే ఆడవాళ్లు... తమలో ఉన్న పోషక లోపాన్ని గమనించుకోరు. ఇలాంటివారు రోజూ ఓ చెంచా అవిసెగింజల్ని తింటే ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చు.

  • అవిసె గింజల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, విటమిన్‌ బి1, బి6, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు దొరుకుతాయి. ఇవి రక్తహీనతను నివారించి, ఎముకల్ని బలంగా మారుస్తాయి. డీహైడ్రేషన్‌ సమస్యని అదుపులో ఉంచుతాయి.
  • రోజుకు రెండు చెంచాల అవిసె గింజలు తీసుకుంటే ప్రీ, పోస్ట్‌ మెనోపాజల్‌ దశలో వచ్చే ఇబ్బందులకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఇందులోని పోషకాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడటం వల్ల ఒంట్లో వేడి ఆవిర్లు తగ్గుతాయి. భావోద్వేగాల హెచ్చుతగ్గులను సమన్వయం చేస్తాయి.
  • చాలామంది మహిళల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం వల్ల శరీరభాగాల్లో నీరు రావడం, వాపులు, నొప్పి వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివారు అవిసెగింజల్ని తరచూ తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్