మునగ పువ్వు.. మేలెంతో!

మునగ కాయల రుచి.. వాటిల్లో ఉండే పోషకాల గురించి మనకు తెలుసు. మునగ పూలల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయనీ తెలుసా? మునగ పువ్వుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీరాడికల్‌్్సతో పోరాడతాయి. ఇవి ముఖంపై ముడతలను నివారిస్తాయి.

Updated : 15 Nov 2023 04:35 IST

మునగ కాయల రుచి.. వాటిల్లో ఉండే పోషకాల గురించి మనకు తెలుసు. మునగ పూలల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయనీ తెలుసా?

  • మునగ పువ్వుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి ముఖంపై ముడతలను నివారిస్తాయి. వీటిల్లో ఉండే ప్రొటీన్‌ జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది.
  • నాలుగు పదులు దాటితే చాలు కీళ్లనొప్పులు మేమున్నామంటూ వచ్చి పలకరిస్తాయి. అలాంటి పరిస్థితి దూరం చేసేందుకు మునగ పూలను ఆహారంలో చేర్చుకోండి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ
  • లక్షణాలు.. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.  
  • కొంతమందిలో ఎంత తక్కువ తిన్నా, జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. అలాంటివారు ఈ పూలను భోజనంలో చేర్చుకోవచ్చు. విటమిన్‌ బి, పీచు పుష్కలంగా అంది.. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు దూరమవుతాయి.
  • విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే... ఈ పూలు జలుబు, ఫ్లూ ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్