ఫైబ్రాయిడ్స్‌కి ఉత్తాన మండూకాసనం!

ఫైబ్రాయిడ్లు సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వస్తుంటాయి. కొందరిలో మెనోపాజ్ సమయంలోనూ రావొచ్చు. హార్మోన్ల లోపాల వల్ల వచ్చే ఈ సమస్య గర్భం రాకుండా అడ్డుకుంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితీయొచ్చు.

Published : 23 Mar 2024 01:37 IST

ఫైబ్రాయిడ్లు సాధారణంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వస్తుంటాయి. కొందరిలో మెనోపాజ్ సమయంలోనూ రావొచ్చు. హార్మోన్ల లోపాల వల్ల వచ్చే ఈ సమస్య గర్భం రాకుండా అడ్డుకుంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. ఇలా కాకుండా ఉండాలంటే ‘ఉత్తాన మండూకాసనా’న్ని ప్రయత్నించి చూడండి.

ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. కాసేపు విశ్రాంతి తీసుకుని రెండు మోకాళ్లనూ ఫొటోలో చూపిన విధంగా వెడల్పు చేసి, వెనక పాదాలను, వేళ్లను మాత్రం కలిపి ఉంచాలి. ఇప్పుడు కుడిచేతిని పైకెత్తి కుడిభుజంపై నుంచి వెనకకు తీసుకొని ఎడమ భుజం కింద అరచేతిని ఉంచాలి. అదేవిధంగా మీ ఎడమచేతిని పైకిలేపి దాన్ని మడిచి, ఎడమ భుజంపైన నుంచి వెనకకు తీసుకురావాలి. ఆ అరచేతిని కుడిభుజం కింద ఉంచాలి. మెడ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడిభుజం నుంచి ఎడమచేతినీ, ఎడమభుజం నుంచి కుడిచేతినీ తీసేయాలి. ఇలా రోజుకి 10 నుంచి 15 సెకన్లు చొప్పున 2 నుంచి 3 సార్లు చేయాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటకు వచ్చి వజ్రాసనంలో కూర్చొవాలి. తరవాత కాళ్లు ముందుకుచాపి విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనం వెన్నెముకకు బలం చేకూరుస్తుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మోకాళ్లు, మోచేతులు సాగదీయడం వల్ల వాటి చుట్టూ ఉండే కండరాలు బలంగా మారతాయి.

ఆహారం.. ఫైబ్రాయిడ్ల సమస్యతో బాధపడేవారు పీచు ఎక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందుకోసం ఓట్స్‌, పప్పు, బార్లీ, కూరగాయలు వంటి వాటిని తీసుకోవాలి. అంతేకాదు, వీటివల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తగినంత పొటాషియం అందేలా చూసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారు ఈస్ట్రోజన్‌ స్థాయులను సరిచూసుకోవాలి. దానికోసం పండ్లు, కూరగాయలు తీసుకుంటూ, బయట ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు తగినంత నిద్ర చాలా అవసరం.

శిరీష, యోగ గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్