వారి ఉద్వేగాలను గమనించండి...

దయ, కోపం, బాధ, ఆవేశం, ఆక్రోశం... ఇవన్నీ పెద్దల్లోనే కాదు.. పిల్లల్లోనూ కనిపిస్తాయి. వాటిని సరైన దారిలో మళ్లించకపోతే..

Published : 14 Jun 2021 17:43 IST

దయ, కోపం, బాధ, ఆవేశం, ఆక్రోశం... ఇవన్నీ పెద్దల్లోనే కాదు.. పిల్లల్లోనూ కనిపిస్తాయి. వాటిని సరైన దారిలో మళ్లించకపోతే.. గుండెలోనే గూడుకట్టుకుని భవిష్యత్తులో మానసిక వ్యాకులతగా పరిణమిస్తాయి. అందుకేం  చేయాలంటే..

తప్పేమీ లేదు!: పిల్లల్లోని కోపం, ఆవేశం, అక్కసూ, అసూయ, భయం వంటివాటిని చూపి వాళ్లని చెడుగా మాట్లాడకండి. అపరాధభావం కలిగించకండి. వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఎప్పుడూ ఉండేలా చూడండి. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయని.. పోరాటపటిమగా మార్చుకోవచ్చని వివరించండి. ఉద్వేగ ప్రజ్ఞ అంటే అదే మరి!

దయ: జీవితంలో ప్రేమించడం, ప్రేమ పొందడంకన్నా ఆనందం మరేదీ ఉండదు. పెద్దలుగా మనమూ నిస్సహాయులపై కరుణ చూపించగలగాలి. దాన్నే పిల్లలూ అనుసరిస్తారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే ఓపికను అలవాటు చేయాలి. అప్పుడప్పుడూ అయినా ఎవరైనా బాధలో ఉంటే అందుకు కారణాలను తెలుసుకోమనండి. వాటికి పరిష్కారాలూ సూచించమనండి. ఇవన్నీ వారిలో ఆలోచనా శక్తిని పెంచుతాయి. నిరుపేద చిన్నారుల విద్యకు సాయం చేయడం, పెద్దలకు సాయం చేసేలా చేయడం వంటివన్నీ వారిలో ఈ ఉద్వేగాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. 

వాస్తవిక ఆలోచన: కొందరు ప్రతి చిన్నవిషయాన్నీ అతిగా ఊహించుకుని ఆలోచిస్తుంటారు. దీనివల్ల తెలియకుండానే ఒత్తిడికి గురవుతుంటారు. సమస్యల్ని చూసి భయపడటమో, కోపం, ఆవేశం తెచ్చుకోవడమో కాకుండా...పరిష్కారాన్ని ఆలోచించే విచక్షణ వారికి అందివ్వాలి. అందుకు పెద్దలుగా మీ చర్చల్లో వారికీ స్థానం కల్పించండి. వారి సలహాలూ తీసుకోండి. ఇవన్నీ బాధ్యతను నేర్పుతాయి. ఉద్వేగాలను నియంత్రించుకునే లక్షణాన్ని అలవరుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్