బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మీరే!

చిట్టితల్లికి వచ్చే సందేహాలన్నీ మాస్టారులా మీరే తీర్చాలి... వాళ్ల కబుర్లకు ఊఊ కొట్టాలి... ఎన్ని పనులున్నా... వారి కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే...

Updated : 29 Jan 2022 05:00 IST

చిట్టితల్లికి వచ్చే సందేహాలన్నీ మాస్టారులా మీరే తీర్చాలి... వాళ్ల కబుర్లకు ఊఊ కొట్టాలి... ఎన్ని పనులున్నా... వారి కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే...
*  ‘ఆదివారం పార్కుకు తీసుకెళతా. పండగకు అమ్మమ్మవాళ్ల ఇంటికెళదాం...’ అంటూ చిన్నారులకు అమ్మలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ముఖ్యంగా పిల్లలకు చెప్పడం కంటే వారికి నచ్చివవి చేసినప్పుడు మరింత ఆనందపడతారు.
* రోజులో ఎక్కువసార్లు చిన్నారిని దగ్గరకు తీసుకోవాలి. మీ వెచ్చని స్పర్శ వారికి వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. మెచ్చుకోలుగా చిన్న కౌగిలింత, ఓ ముద్దు ద్వారా మీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇవి వారిలో మీ పట్ల ప్రేమను రెట్టింపు చేయడమే కాకుండా మీరున్నారనే భరోసా కలుగుతుంది.
* కొందరు చిన్నారులు చురుగ్గా ఉంటారు. మరికొందరు ఏ పనైనా నెమ్మదిగా చేస్తారు. అలాంటప్పుడు వారికి  చదువు చెప్పే సమయంలో, పనులు అప్పగించేటప్పుడు మృదువుగా వ్యవహరించాలి. సరిగా చేయకపోతే మరోసారి బాగా చేయమని ప్రోత్సహించాలే తప్ప కోప్పడొద్దు. వారికి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవాటు చేయాలి. ఈ క్రమంలో కాస్త కఠినంగా ఉన్నా ఫరవాలేదు.
* చిన్నారి భద్రత గురించి అన్ని రకాలుగా ఆలోచించాలి. అన్ని సందర్భాల్లో తను ఆనందంగా, ధైర్యంగా ఉండేలా చూడాలి. స్కూలుకెళ్లే వారైౖతే ఆరోజు స్కూల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి. వారికి కావాల్సినవి, వారు భయపడిన సందర్భం, ఇష్టాలు.. ఇలా అన్నింటిని అడిగి తెలుసుకోవాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి.
*చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇతరుల పిల్లలతో లేదా తోబుట్టువులతో పోలుస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే వారిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. క్రమంగా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
* టెన్నిస్‌, క్రికెట్‌, తాడాట, బంతాట.. ఇలా వారికి నచ్చిన ఆటను ఇద్దరూ కలిసి ఆడితే వారి ఆనందానికి అవధులుండవు... ఇలా చేస్తే మీకూ ఆనందం, ఆరోగ్యం రెండూ సొంతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్