కారణం కాదు... పరిష్కారమే కావాలి

ఆలుమగలు పోట్లాడుకోవడానికి అన్నిసార్లూ పెద్ద కారణాలే ఉండక్కర్లేదు. కూర సరిగా వండలేదనీ, ఆలస్యంగా నిద్రలేచారనీ...ఇలా ఏదైనా సరే అగ్గిపుట్టించొచ్చు. ఎందుకిలా అనే కంటే...ఏం చేయాలి అని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ ఇద్దరిమధ్యా అనుబంధం కొంతవరకూ తగ్గుతుంది.

Published : 18 Jan 2023 00:26 IST

ఆలుమగలు పోట్లాడుకోవడానికి అన్నిసార్లూ పెద్ద కారణాలే ఉండక్కర్లేదు. కూర సరిగా వండలేదనీ, ఆలస్యంగా నిద్రలేచారనీ...ఇలా ఏదైనా సరే అగ్గిపుట్టించొచ్చు. ఎందుకిలా అనే కంటే...ఏం చేయాలి అని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.

ఏళ్లు గడిచేకొద్దీ ఇద్దరిమధ్యా అనుబంధం కొంతవరకూ తగ్గుతుంది. బాధ్యతలు పెరగడం, పనిఒత్తిడి అందుకు కారణం కావచ్చు. దాంతో ఇద్దరిలో సహనం తగ్గుతుంది. చిన్నచిన్న విషయాలకే రుసరుసలు మొదలవుతాయి. అలాంటప్పుడు కాస్త ఓర్పుతో అవతలివారి సమస్య వినడానికి ప్రయత్నించండి. సమాధానమూ సున్నితంగా చెప్పండి. గొడవకి ఫుల్‌ స్టాప్‌ పడుతుంది.

భాగస్వామి కాబట్టి మీ గురించి రెండోవారికి అన్నీ తెలుసని అనుకుని ఆసక్తులూ, అభిప్రాయాలూ చెప్పడం మానేస్తుంటారు చాలామంది. అది అన్నిసార్లు కాకపోవచ్చు. కానీ చాలాసార్లు మీరనుకున్నట్లు జరగకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మీ ఆలోచనలూ, ఆసక్తుల్ని, అభిరుచుల్నీ భాగస్వామికి తెలియజేయాలి. దానివల్ల మీ ఇద్దరిమధ్యా అనుబంధం పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్