సరదాగానే ఫోన్‌ దూరమిక!

పిల్లల పెద్ద వ్యాపకం ఇప్పుడు మొబైలే! ఒకసారి ఇచ్చామంటే దాన్ని మళ్లీ తిరిగి తీసుకోవడానికి చాలా కష్టపడాలి. వాళ్లకి ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెలియక సతమతమయ్యే అమ్మానాన్నలూ ఎంతోమంది.

Published : 28 Feb 2023 00:59 IST

పిల్లల పెద్ద వ్యాపకం ఇప్పుడు మొబైలే! ఒకసారి ఇచ్చామంటే దాన్ని మళ్లీ తిరిగి తీసుకోవడానికి చాలా కష్టపడాలి. వాళ్లకి ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెలియక సతమతమయ్యే అమ్మానాన్నలూ ఎంతోమంది. ఎంతసేపని ఫోన్‌ దాయడం, కొట్టడం లాంటివి చేయగలం? అలాగని ఇచ్చేసి కూర్చోలేం. మరో దారి కోసం వెతుకుతున్నారా? ఈ స్క్రీన్‌ టైమ్‌ టోకెన్స్‌ ప్రయత్నించేయండి. పిల్లలను ఎంత సమయం చూడాలనుకుంటున్నారో ఎంచుకోమనండి. సంబంధిత టోకెన్‌ గెలుచుకోవడానికి పిల్లలు పెట్టిన భోజనం చేయడం, స్నేహితులతో ఆడుకోవడం, గది సర్దడం.. ఇలా ఎంచుకున్న సమయాన్ని బట్టి, టోకెన్‌ వెనక ఉన్న పని పూర్తిచేయాలి. అప్పుడే వాళ్లకి టోకెన్‌ దక్కుతుంది. గెలుచుకున్నంత సమయం చూడొచ్చు. 5 నిమిషాల నుంచి గంట వరకు ఉంటాయి. దాంతోపాటుగా చిన్న టైమర్‌ కూడా వస్తుంది. పిల్లల చేతికి మొబైల్‌ ఇవ్వగానే దీన్నీ సెట్‌ చేసుకొని ఉంచుకోవాలి. అలారం మోగగానే పిల్లలు తిరిగి మొబైల్‌ ఇచ్చేయాలి. బాగుంది కదూ ఈ విధానం. ఏదైనా సాధిస్తేనే కోరుకున్నది దక్కుతుందన్నది అలవాటవుతుంది, ఫోన్‌ నుంచీ కొంచెం దూరం చేసినట్టూ ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌ వేదికల్లో దొరుకుతున్నాయి.. వెతికేయండి. లేదూ కాస్త శ్రమపడితే సొంతంగానూ ప్రయత్నించేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్