నాణాలు తింటోంది!

నల్లటి ముసుగు వ్యక్తి... చేతిలో చిన్న పళ్లెం... చూడటానికి వింతగా ఉంది కదూ. ఇదొక పిగ్గీ బ్యాంక్‌ బాక్స్‌. ఈ మూతలో నాణెం వేస్తే సరి ఆటోమేటిక్‌గా అది పైకి లేచి బొమ్మనోటి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో చక్కటి సంగీతం కూడా వినిపిస్తుంది. ఇంతలో నోరు తెరుచుకోవడంతో నాణాలన్నీ నోట్లో పడిపోతాయి.

Published : 15 Feb 2022 02:00 IST

నల్లటి ముసుగు వ్యక్తి... చేతిలో చిన్న పళ్లెం... చూడటానికి వింతగా ఉంది కదూ. ఇదొక పిగ్గీ బ్యాంక్‌ బాక్స్‌. ఈ మూతలో నాణెం వేస్తే సరి ఆటోమేటిక్‌గా అది పైకి లేచి బొమ్మనోటి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో చక్కటి సంగీతం కూడా వినిపిస్తుంది. ఇంతలో నోరు తెరుచుకోవడంతో నాణాలన్నీ నోట్లో పడిపోతాయి. ఇది కేవలం పొదుపు చేయడానికి ఉపయోగపడే పిగ్గీ బ్యాంకే కాదు... హాలులో, డెస్క్‌లో టేబుల్‌పై చక్కగా పెట్టుకోవచ్చు. చూడటానికీ చాలా బాగుంటుంది. చిన్నారులకు పుట్టిన రోజు కానుకగా ఇవ్వడం ద్వారా వారిలో పొదుపు గుణాన్ని పెంపొందించవచ్చు. భలే ఉంది కదూ. మీ పాపాయికి, బుజ్జిగాడికి కొనిపెట్టేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్