లక్ష్యాన్ని చేరాలంటే...

సౌజన్య కాలేజీలో చేరేటప్పుడు ఎన్నో లక్ష్యాలతో ఉండేది. చాలా కలలు కనేది. అయితే ఆ ఉత్సాహం క్రమేపీ ఎందుకు తగ్గిపోతోందో ఆమెకే తెలియడం లేదు. ఇటువంటి సమస్యకు కొన్ని కారణాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. దానికి పరిష్కారాలనూ సూచిస్తున్నారు. ...

Updated : 14 Sep 2021 01:16 IST

సౌజన్య కాలేజీలో చేరేటప్పుడు ఎన్నో లక్ష్యాలతో ఉండేది. చాలా కలలు కనేది. అయితే ఆ ఉత్సాహం క్రమేపీ ఎందుకు తగ్గిపోతోందో ఆమెకే తెలియడం లేదు. ఇటువంటి సమస్యకు కొన్ని కారణాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. దానికి పరిష్కారాలనూ సూచిస్తున్నారు.  

లక్ష్య సాధనను మధ్యలో వదిలేయకూడదు. అడ్డంకులెన్నెదురైనా దాటి ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి.అధైర్యపడితే విజయాన్ని పొందడం కష్టతరమవుతుంది. దాంతో లక్ష్యం బలహీనపడుతుంది.

వాయిదా పద్ధతి అలవాటుంటే దాన్ని దూరంగా ఉంచాలి. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడానికి కృషి చేయాలి. అప్పుడే.. తర్వాతి అడుగు వేయగలరు.

లక్ష్యాన్ని చేరుకోవాలనే బలమైన నిర్ణయం మనసు నుంచి దూరమవకూడదు. అలాగే నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే చాలు. ఆసక్తి పెరుగుతుంది. అనుకున్నది సునాయసంగా సాధించొచ్చు.

ఎప్పటికప్పుడు దక్కించుకున్న చిన్నచిన్న విజయాలకు మనకు మనమే ప్రశంసించుకోవాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేలా చేస్తుంది. ముందుకు వెళ్లడానికి ప్రోత్సాహకరంగా మారుతుంది.

ఒక పుస్తకంలో నిర్దేశించుకున్న మార్గాన్ని రాసి ఉంచుకోవాలి. దాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఎదురైన విజయాలు, వైఫల్యాలు వంటివన్నీ అందులో పొందుపరుస్తూ ఉండాలి. వీటిని చదివిన ప్రతిసారీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సాధించడానికి ఇంకెంతో దూరం లేదనే భావన మనసులో కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్