నాకు తెలియకుండా విల్లు మార్చగలరా?

ఐదేళ్ల క్రితం మా తాత గారు, నానమ్మ తదనంతరం నాకు చెందేలా రెండెకరాల పొలాన్ని ఆమె పేరు మీద రాసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆవిడకు నాకంటే కూతురు బిడ్డలంటేనే ఎక్కువ ఇష్టం. దీన్ని భవిష్యత్తులో

Published : 26 Jun 2021 04:48 IST

ఐదేళ్ల క్రితం మా తాత గారు, నానమ్మ తదనంతరం నాకు చెందేలా రెండెకరాల పొలాన్ని ఆమె పేరు మీద రాసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆవిడకు నాకంటే కూతురు బిడ్డలంటేనే ఎక్కువ ఇష్టం. దీన్ని భవిష్యత్తులో మాకు తెలియకుండా మార్చే వీలుంటుందా? - ఓ సోదరి, హన్మకొండ
సాధారణంగా ఏ వీలునామా అయినా ఆ వ్యక్తుల తదనంతరమే చెల్లుబాటు అవుతుంది. మీ తాతగారు... ఆయన భార్యకి లైఫ్‌ ఎస్టేట్‌ ఇచ్చారు అంటే... అనుభవించే హక్కును అందించారు. మనవరాలిగా మీకు శాశ్వత హక్కును కల్పించినట్లు మీ లేఖ సూచిస్తోంది. అయితే, మీ నానమ్మగారికి ఆ పొలాన్ని అమ్ముకునే హక్కు ఉండదు. అలాగే ఆవిడ బతికి ఉన్నంతకాలం ఆస్తి మీ చేతికి రాదు. ఆవిడ బతికి ఉండగానే మీరు/ తదనంతర హక్కు గలవారెవరైనా ఆస్తిని స్వాధీన పరుచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ విల్లు రద్దవుతుందనే నిబంధన కూడా పెట్టే అవకాశం రాసే వారికి ఉంటుంది. ముందు ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఇక, మీ తాతగారు బతికినన్నాళ్లు తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా వీలునామా మార్చుకోవచ్చు. అయితే చివరగా రాసిందే చెల్లుబాటు అవుతుంది. ఆస్తి ఎవరి పేరుమీద రాస్తున్నారో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన ఆస్తిని నచ్చినవాళ్లకు, ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చే హక్కు ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్