వయసు 23... బరువు 30!

నా వయసు 23, ఎత్తు 4.9. బరువు 30 కిలోలు. పదహారేళ్లప్పుడు 35 కిలోలున్న బరువు మలేరియా రావడంతో 25కి పడిపోయింది. అప్పటి నుంచి పెరగలేదు. ఈ మధ్యే చూసుకుంటే 28 కిలోలున్నా. డాక్టర్‌ని కలిస్తే విటమిన్ల మాత్రలు, శక్తినిచ్చే టానిక్కులు రాసిచ్చారు. మధ్యాహ్నం,

Published : 18 Feb 2022 01:39 IST

నా వయసు 23, ఎత్తు 4.9. బరువు 30 కిలోలు. పదహారేళ్లప్పుడు 35 కిలోలున్న బరువు మలేరియా రావడంతో 25కి పడిపోయింది. అప్పటి నుంచి పెరగలేదు. ఈ మధ్యే చూసుకుంటే 28 కిలోలున్నా. డాక్టర్‌ని కలిస్తే విటమిన్ల మాత్రలు, శక్తినిచ్చే టానిక్కులు రాసిచ్చారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలతోపాటు మధ్యమధ్యలో పాలు, గుడ్లు, అరటిపండ్లు, పండ్లరసాలు, మెయనెయిజ్‌ రాసిన బ్రెడ్‌ తీసుకోమన్నారు. ఇవి తీసుకుంటూ 12 రోజుల్లో కిలోన్నర బరువు పెరిగా. ఇలా బరువు పెరిగే విధానం మంచిదేనా?

- ఓ సోదరి

రోజువారీ ఆహారంతోపాటు అదనంగా ఈ పదార్థాలను తీసుకుంటున్నారు కాబట్టి మీ శరీరానికి అందించే పోషకాలు, శక్తి పెరిగాయి. దాంతో కొద్దిగా బరువు పెరిగారు. నిజానికి మీరు ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఐతే ముందు నుంచి ఇలా తక్కువ బరువే ఉంటే... ఇది కొత్తగా వచ్చిన ఆరోగ్య సమస్య కాదు. మీ ఎత్తుకి 30 కిలోలంటే అది చాలా తక్కువ బరువు కిందే లెక్క. మీకిప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, గర్భధారణలో లేదా అనారోగ్యం వస్తే లేదా ఆపరేషన్‌ చేయాల్సిన వచ్చినా.. శరీరంలో శక్తి నిల్వలు లేకపోవడం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, పోషకాల లేమి వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

బరువు పెరగడానికి...

వైద్యులు చెప్పిన ఆహారపు అలవాట్లను మీరు దాదాపు 10 కిలోల బరువు పెరిగే వరకు పాటించాలి. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మరిన్ని రోజులు తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు బరువు పెరగడం కొంచెం సులభమవుతుంది. ఇందుకోసం ఉడికించిన గుడ్డు బదులుగా గుడ్డు పొరటు (స్క్రాంబుల్డ్‌ ఎగ్‌)లా తింటే త్వరగా జీర్ణమవుతుంది. బ్రెడ్‌ను మెయనెయిజ్‌తోపాటు తేనె, పీనట్‌ బటర్‌, జామ్‌తో తినొచ్చు. పండ్లు, పాలు, తేనె, ఐస్‌క్రీమ్‌ కలిపి స్మూథీలా తాగొచ్చు. మీ వైద్యులు సూచించిన డైట్‌ మీకు సరిపోయింది. దీన్ని కొనసాగిస్తూనే ఈ అదనపు ఆహార పదార్థాలనూ తీసుకోండి. రోజువారీ ఆహారంలో ఇడ్లీ, అటుకులు, డోక్లా, సేమ్యా ఉప్మా, నూడుల్స్‌, కూరగాయల సూప్‌, మెత్తగా ఉడికించిన చికెన్‌, కీమా తీసుకోవచ్చు. నెయ్యితో చేసిన పులావ్‌, వెజిటేబుల్‌ ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌ తినొచ్చు. ఈ పదార్థాలన్నీ కొన్నాళ్లకు హెవీగా అనిపిస్తే... తేలికగా జీర్ణమయ్యే మెడికల్‌ న్యూట్రిషనల్‌ సప్లిమెంట్స్‌తోపాటు అరుగుదలను పెంచే టానిక్స్‌నూ వాడాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీంతో అరుగుదల పెరుగుతుంది. శరీరంలో కొవ్వు పెరగకుండా కండ పెరిగే అవకాశముంటుంది. హిమోగ్లోబిన్‌ శాతం ఎంతుందో చూసుకుని దానికి తగ్గట్లు పోషకాలు తీసుకోవాలి..

* బరువు తక్కువగా ఉండి, ఇతరత్రా అనారోగ్యాలు లేకపోతే.. కచ్చితంగా బరువు పెరగాల్సిన సమయంలో ఈ డైట్‌ పాటించడంలో తప్పు లేదు. మీ ఎత్తుకు తగిన బరువు వచ్చే వరకు దీన్ని కొనసాగించొచ్చు..అంటే 4.9 ఎత్తుకి దాదాపు 40 నుంచి 50 కిలోల బరువు ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్