అసలు.. స్పందించడే!

నాలుగేళ్లుగా ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాను. ఇది నా మొదటి ఉద్యోగం. నా సమస్యల్లా దేనికీ స్పందించని నా బాస్‌తోనే! ప్రాజెక్టులో ఒక దశ పూర్తయింది, కొనసాగించడానికి కొన్ని సూచనలు కావాలి...

Updated : 22 Mar 2022 04:45 IST

నాలుగేళ్లుగా ఓ చిన్న వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాను. ఇది నా మొదటి ఉద్యోగం. నా సమస్యల్లా దేనికీ స్పందించని నా బాస్‌తోనే! ప్రాజెక్టులో ఒక దశ పూర్తయింది, కొనసాగించడానికి కొన్ని సూచనలు కావాలి... అదే చెబుతూ మెసేజ్‌ చేస్తే.. చూస్తారు కానీ స్పందనుండదు. వారానికోసారి సమావేశం ఉంటుంది.. చెప్పకుండా మానేస్తారు. అడిగినా ఫలితముండదు. ప్రాజెక్టు గడువు ముగుస్తున్నప్పుడు పరిస్థితి మరీ దారుణం. సకాలంలో చేసినా స్పందన లేక ఆలస్యమవడమో, పనివేళలు ముగిశాక మార్పులు చెప్పడమో జరుగుతుంటుంది. అసలు ఇదేం పరిస్థితి?

- శ్రీకళ

మీరు ఉద్యోగ జీవితం ప్రారంభంలో ఉన్నారు. కాబట్టి, చాలా అంశాలను నేర్చుకోవాలి. చాలావరకూ పై అధికారులు నేరుగా వివరించనంత వరకూ అంతా సజావుగానే సాగుతోందనుకుంటారు. వాళ్లకి అనేక బాధ్యతలుంటాయి. దీంతో మీది వాళ్ల దృష్టి దాటిపోవచ్చు. అలాగని ఏదైనా పొరబాటు జరిగితే పూర్తి బాధ్యత మీదే అనీ అనలేం. ముందు మీ బాస్‌తో మాట్లాడండి. ఆయన స్పందన ఆలస్యమవుతుండటం వల్ల కలిగే ఇబ్బంది ప్రాజెక్టు ఆలస్యానికి ఎలా కారణమవుతోందో చెప్పండి. అలాంటి సమయాల్లో ఆయన్ని సంప్రదించే ఇతర మార్గాలనూ కనుక్కోండి. ఏ కారణం చేతనైనా ఆయన దొరక్కపోతే తీసుకోవాల్సిన చర్యలనూ తెలుసుకోండి. ఇవన్నీ తాజా పరిస్థితితోపాటు మార్చుకోవాల్సిన విధానాలపైనా ఆయనకు అవగాహన ఏర్పరుస్తాయి.
ఇక పనివేళల విషయంలో.. ఆయన్నుంచి మెసేజ్‌ రాగానే ఏవేళైనా చాలావరకూ మీరు స్పందిస్తుంటారు. దీంతో ఏ సమయమైనా ఫర్లేదని పరోక్షంగా ఆయనకు చెబుతున్నారు. కాబట్టి, ‘మనం చాలావరకూ ఈ విషయాలను ఫలానా సమయంలోనే చర్చిద్దాం. నాకు ఇంటి బాధ్యతలుంటాయి. అత్యవసరమైతే ఫర్లేదు కానీ.. పని వేళల్లోనే చర్చించుకునేలా చూసుకుందామా?’ అనండి. చెప్పలేకపోతే.. ఈసారి నుంచి పనివేళల తర్వాత ఫోన్‌కు దూరంగా ఉండండి. మరుసటి రోజు ‘ఇప్పుడే చూశాను. మీరు పంపేటప్పటికి నా పనివేళలు ముగిశాయి’ అని చెప్పండి. పని ఆలస్యమవుతుంది నిజమే. కానీ అలా చేయకపోతే ఇదెప్పటికీ ఆగదు. ఇవేమీ పనిచేయలేదూ.. రాజీనామా చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్