మీరు ఒంటరి కాదు..మేము తోడున్నాం!

కొవిడ్‌కి హోమ్‌ ఐసోలేషన్‌ ద్వారా కోలుకుంటున్నవారే ఎక్కువ. కానీ ఆ సమయంలో వేసుకోవాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. ఇలాంటివారికి సాయం చేయడానికి డాక్టర్‌ అహిలా అయ్యావూ ఆధ్వర్యంలో ఓ వేదిక సిద్ధమైంది.

Published : 22 May 2021 01:17 IST

కొవిడ్‌కి హోమ్‌ ఐసోలేషన్‌ ద్వారా కోలుకుంటున్నవారే ఎక్కువ. కానీ ఆ సమయంలో వేసుకోవాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. ఇలాంటివారికి సాయం చేయడానికి డాక్టర్‌ అహిలా అయ్యావూ ఆధ్వర్యంలో ఓ వేదిక సిద్ధమైంది.
కోయంబత్తూరుకు చెందిన అహిలా అయ్యావూ పీడియాట్రిక్‌ ఎండోక్రైనాలజిస్ట్‌. ‘కొవిడ్‌ సోకినవారిలో 75 శాతం మంది హోమ్‌ ఐసోలేషన్‌ ద్వారా కోలుకోవచ్చు. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సరైన మెడికేషన్‌, జాగ్రత్తలు తీసుకుంటే సరి’ అంటారు అహిలా. కానీ దేశవ్యాప్తంగా ఈ అవగాహన కొరవడుతోందని భావించింది. టెలి మెడిసిన్‌ సర్వీస్‌ ద్వారా వీటిపై అవగాహన కల్పించవచ్చనుకుంది.
దేశ, విదేశాల్లో డాక్టర్లుగా చేస్తున్న తన బ్యాచ్‌మేట్లు, జూనియర్లను సంప్రదించింది. తీవ్ర లక్షణాలున్న వారితో ఆసుపత్రులన్నీ నిండిపోయి, తక్కువ లక్షణాలు ఉన్న చాలా మందికి డాక్టర్లను సంప్రదించే వీలు లేకపోవడాన్ని వారితో చర్చించింది. ఒక వేదికగా వారికి సాయం చేద్దామని పిలుపునిచ్చింది. వారూ ముందుకొచ్చారు. మొత్తం 28 మందితో కలిసి ‘వైఏఎన్‌ఏ (యూ ఆర్‌ నాట్‌ అలోన్‌) ఇండియా’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. డాక్టర్లతోపాటు సాంకేతిక నిపుణులు, వాలంటీర్లనూ అహిలా ఇందులో భాగంగా చేర్చింది.

ఈ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా రోగి పరిస్థితిని అంచనా వేసి, మందులు సూచిస్తారు. కాకపోతే కొవిడ్‌ నిర్థరణ అయినవారు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. దాని ప్రకారం వారికి తేదీ, సమయాలతో స్లాట్‌ కేటాయిస్తారు. వారికి ఒక వాలంటీరును కేటాయిస్తారు. వీరు ఆ పేషెంట్‌కు అన్నివేళలా అందుబాటులో ఉంటారు. ఈ సేవలన్నీ ఉచితమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్