రోజూ వందమందికి ప్రసాదం!

కొవిడ్‌కు గురైన కుటుంబాలకు రెండు పూటలా ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది నీనా మునియాల్‌. తోటి మహిళతో కలిసి ‘ప్రసాదం’ పేరుతో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది ఆగ్రాకు చెందిన నీనా మునియాల్‌ బృందం.  

Published : 25 May 2021 00:39 IST

కొవిడ్‌కు గురైన కుటుంబాలకు రెండు పూటలా ఉచితంగా ఆహారాన్ని అందిస్తోంది నీనా మునియాల్‌. తోటి మహిళతో కలిసి ‘ప్రసాదం’ పేరుతో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది ఆగ్రాకు చెందిన నీనా మునియాల్‌ బృందం.  
ఈ ఏడాది కరోనా వ్యాప్తి తిరిగి పెరిగిపోవడం గుర్తించారు నీనా, ఆమె స్నేహితురాళ్లు. బాధితుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అలా ప్రారంభమైందే ‘ప్రసాదం’. మొదట్లో అందరూ కలిసి వంటచేసి బాధితులకు పంపాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఎవరికివారే తమ ఇంట్లో ఆహారాన్ని తయారు చేయాలని ఏప్రిల్‌లో నిశ్చయించుకున్నారు. ఇందుకోసం చుట్టు పక్కల ప్రాంతాలను ఎంచుకుని, అక్కడివారికి తమ సేవ గురించి వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో సమాచారమిచ్చారు. అందులో ఆయా ప్రాంతాల్లో ఉన్న ‘ప్రసాదం’ బృంద మహిళల ఫోన్‌ నెంబర్లు పొందుపరిచారు. అలా నీనాకు ఫోన్‌కాల్స్‌ రావడం మొదలైంది. అవసరమైన వారు గ్రూపులో వారి వివరాలతో పాటు కొవిడ్‌ నిర్థరణ పరీక్ష నివేదిక ఉంచితేచాలు. వారికి రెండు వారాల పాటు భోజనాన్ని పంపిణీ చేస్తున్నాం.  ‘మధ్యాహ్నం లంచ్‌ ఒంటిగంటకు, అలాగే రాత్రి ఏడున్నర గంటలకు డిన్నర్‌ అందిస్తున్నాం. రోటీ, కూర, కిచిడీ వంటివాటితోపాటు కొందరికి సలాడ్‌, సూప్‌ వంటి ఆహారాన్నీ పంపిస్తున్నా. అయితే అన్నింటిలో పోషక విలువలుండేలా జాగ్రత్తపడుతున్నా. మా ఇంటికి దగ్గర్లోని ఖండారీ, లాయర్స్‌ కాలనీ, సికంద్రా, బాఘ్‌ ఫర్జానా, లాజ్‌పుట్‌ కుంజ్‌, దివానీ ప్రాంతాలకు చెందిన 100 మందికి రెండుపూటలా ఆహారాన్ని తయారుచేసి పంపిస్తున్నా. ఇందుకోసం ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా నా సొంత ఖర్చుతోనే. ఈ వైరస్‌ తగ్గుముఖం పట్టేవరకూ ఈ సేవలను కొనసాగిస్తాం. భగవంతుడు మా ద్వారా ప్రసాదాన్ని అందరికీ అందించే అవకాశాన్ని కల్పించాడ’ని సంతోషిస్తోంది నీనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్