Aishwarya Lakshmi: నోరు కట్టేసుకోవద్దు

ఆహారమే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చిందంటే నమ్ముతారా? ఎంబీబీఎస్‌ తుది పరీక్షలు రాశా. ఇన్నాళ్లు కష్టపడ్డందుకు నాకు నేనే కొంత విరామం ఇచ్చుకోవాలనుకున్నా. ఓ రెస్టారెంట్‌కి వెళితే ఆడిషన్స్‌ గురించి తెలిసింది. సరదాగా ప్రయత్నించి.. అనుకోకుండా ఎంపికయ్యా. అదీ నా మొదటి సినిమా అనుభవం. పేరొచ్చినా.. నా నటన నాకు నచ్చలేదు.

Published : 31 May 2023 04:45 IST

హారమే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చిందంటే నమ్ముతారా? ఎంబీబీఎస్‌ తుది పరీక్షలు రాశా. ఇన్నాళ్లు కష్టపడ్డందుకు నాకు నేనే కొంత విరామం ఇచ్చుకోవాలనుకున్నా. ఓ రెస్టారెంట్‌కి వెళితే ఆడిషన్స్‌ గురించి తెలిసింది. సరదాగా ప్రయత్నించి.. అనుకోకుండా ఎంపికయ్యా. అదీ నా మొదటి సినిమా అనుభవం. పేరొచ్చినా.. నా నటన నాకు నచ్చలేదు. అక్కడి నుంచి ఆహార్యం, ఫిట్‌నెస్‌ అన్నింటిపైనా దృష్టిపెట్టా. అలాగని ఇష్టాలనేమీ త్యాగం చేయలేదు. రోజూ శరీరానికి పోషకాలన్నీ అందేలా చూసుకున్నా.. వారాంతాల్లో నియమాలన్నీ పక్కన పెట్టేస్తా. నచ్చినవన్నీ తినేస్తా.

బదులుగా జిమ్‌లో ఇంకాస్త ఎక్కువ శ్రమిస్తా. ఆరోగ్యమ్మీద దృష్టి పెట్టడంలో తప్పులేదు కానీ మరీ నోరు కట్టేసుకోకండి. సన్నబడటం కాదు.. ఆరోగ్యంగా ఉండటం మేలు. బలవంతంగానూ వ్యాయామం చేయొద్దు. నాలుగు గోడల మధ్య నచ్చకపోతే ఆరుబయట పరుగెత్తండి. నచ్చిన పాటకి చిందులు వేయండి. నేనదే చేస్తా. నా అంతిమ లక్ష్యం ఉల్లాసంగా ఉండటం.. మీరూ ఈ సూత్రాన్ని ప్రయత్నించి చూడండి. ఆనందంగా కొనసాగించగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్