పెదాలు పొడిబారుతున్నాయా?

చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొంతమందికి పెదవుల పైన చర్మం పగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి తరచుగా వాడాల్సి వస్తుంటుంది.

Published : 19 Jan 2024 12:14 IST

చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొంతమందికి పెదవుల పైన చర్మం పగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి తరచుగా వాడాల్సి వస్తుంటుంది. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాల ద్వారా అధరాల్లో తేమ నిలిచి ఉండేలా జాగ్రత్తపడచ్చు..

గులాబీ రేకులతో..

కొన్ని గులాబీ రేకులు తీసుకొని పచ్చిపాలలో కొన్ని గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తని ముద్దలా చేసుకోవాలి. లిప్ బామ్‌కి బదులుగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజులో మూడు నుంచి నాలుగుసార్లు ఈ గులాబీ పేస్ట్‌ని అప్త్లె చేసుకోవడం ద్వారా పెదవుల మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పెదవులు గులాబీ రంగుని సైతం సంతరించుకుంటాయి.

పాలమీగడతో..

పాలమీగడలో ఉండే కొవ్వు పదార్థాలు పెదవులకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. అలాగే పగిలిన అధరాలను తిరిగి మామూలుగా అయ్యేలా చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడం కోసం పాలమీగడను పెదవులకు రాసుకొని కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేస్తే సరిపోతుంది.

ఇవి కూడా..

⚛ తొక్క తీసిన కీరాదోస ముక్కను మెత్తగా చేసుకోవాలి. దీన్ని పెదవులకు రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

⚛ అధరాలను రోజూ కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉంటే పొడిబారకుండా ఉంటాయి.

⚛ ఆముదంలో మూడు నుంచి ఐదు చుక్కల చొప్పున గ్లిజరిన్, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదవులకు అప్త్లె చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

⚛ నిద్రపోయే ముందు తాజా వెన్న రాసుకోవడం ద్వారా పెదవులు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

⚛ సమపాళ్లలో గ్లిజరిన్, రోజ్ వాటర్ తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని నిద్రపోయే ముందు పెదవులకు అప్త్లె చేసుకోవాలి. ఇలా ఐదు రోజుల పాటు చేస్తే.. పెదవుల అందం రెట్టింపవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్