హెర్బల్ బ్లీచ్ ఇంట్లోనే ఇలా...!

ఫేషియల్ బ్లీచ్ అనగానే అందరి చూపూ బ్యూటీ పార్లర్ల వైపే ఉంటుంది. కానీ, కాస్త ఓపిక వహిస్తే ఇంట్లోనే సులభంగా బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. ఇదేదో బాగుందే! ఎలా సాధ్యం అనుకుంటున్నారా! అదెలాగో తెలుసుకోవాలంటే....

Published : 02 Jun 2023 10:35 IST

ఫేషియల్ బ్లీచ్ అనగానే అందరి చూపూ బ్యూటీ పార్లర్ల వైపే ఉంటుంది. కానీ, కాస్త ఓపిక వహిస్తే ఇంట్లోనే సులభంగా బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. ఇదేదో బాగుందే! ఎలా సాధ్యం అనుకుంటున్నారా! అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే మరి!

కావాల్సినవి

పుల్లటి పెరుగు - పావుకప్పు

పసుపు - పావు టీస్పూన్

చందనం పౌడర్ - పావు టీస్పూన్

నిమ్మరసం - ఒక స్పూన్

తేనె - 2 టీస్పూన్లు

నిమ్మతొక్కల పొడి - పావు టీస్పూన్

నారింజ తొక్కల పొడి - పావు టీస్పూన్

బ్లీచ్ వేసుకునే విధానం

పైన చెప్పినవన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ముఖాన్ని శుభ్రపరుచుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మర్దన చేస్తూ శుభ్రపరుచుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వేసుకోవచ్చు.

సున్నిత చర్మతత్వం ఉన్న వారు దీనిని వాడే విషయంలో ఓసారి వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్