Parenting: పిల్లల ముందు.. గొడవలా?
పిల్లల మొదటి స్కూలు ఇల్లే. మంచైనా, చెడైనా ప్రతిదీ ఇంటి నుంచే నేర్చుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు వారి చిన్ని మనసులపై బలంగా నాటుకుపోయే అవకాశం ఉంది.
పిల్లల మొదటి స్కూలు ఇల్లే. మంచైనా, చెడైనా ప్రతిదీ ఇంటి నుంచే నేర్చుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు వారి చిన్ని మనసులపై బలంగా నాటుకుపోయే అవకాశం ఉంది. అందుకే, ఈ వాతావరణం సానుకూలంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు..
* ఇంట్లో పెద్దలు సంతోషంగా ఉంటే పిల్లలూ అలాగే ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవలు పడుతుంటే అది వారిని మానసికంగా బాధిస్తుంది. అందువల్ల ఏదైనా వాదన భార్యాభర్తల మధ్య తలెత్తినప్పుడు చుట్టూ పిల్లలు ఉన్నారా.. వింటున్నారా అనేది గమనించండి. అసలు వారిముందు వాదనలు పెట్టుకోకుండానే ఉండాలి. ఇద్దరి మధ్యా ఎన్ని గొడవలున్నా పిల్లల దగ్గరికొచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టేయాలి. భాగస్వామి మీద కోపం పిల్లలపై చూపించకూడదు.
* ఈ రోజుల్లో పిల్లల్ని పట్టించుకోవడమంటే... వారికి కావాల్సినవన్నీ కొనిపెడుతున్నాం. స్కూల్‌కి వెళుతున్నారు. సంతోషంగానే ఉన్నారని కొందరు తల్లిదండ్రులు సమాధానమిస్తారు. కానీ నిజానికి పట్టించుకోవటమంటే అది కాదు. వారితో కూర్చొని సరదాగా మాట్లాడాలి. దేనిగురించైనా ఇబ్బంది పడుతున్నారేమో కనుక్కోవాలి. సమస్యలేవైనా ఉంటే పరిష్కరించాలి. అప్పుడు చిన్నారులు సంతోషంగా ఉంటారు. అలాగే పిల్లల్ని తరచూ దగ్గరికి తీసుకొని హత్తుకోవాలి. మీతో ఏ విషయాన్నైనా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యంగా ఎదగగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.