పాపాయి బయటికి పోకుండా..!

పసి పిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. ఒక చోట కూర్చోబెడితే.. మరో చోటికి పాక్కుంటూ వెళ్లిపోతారు. ఇక తలుపులు తీసుంటే మాత్రం.. మన కళ్లు గప్పి బయటికి వెళ్లిపోతుంటారు. అలాగని నిరంతరం వాళ్లను కనిపెట్టుకొని ఉండలేం.

Published : 28 Sep 2023 12:01 IST

(Photos: Amazon.in)

పసి పిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉండరు. ఒక చోట కూర్చోబెడితే.. మరో చోటికి పాక్కుంటూ వెళ్లిపోతారు. ఇక తలుపులు తీసుంటే మాత్రం.. మన కళ్లు గప్పి బయటికి వెళ్లిపోతుంటారు. అలాగని నిరంతరం వాళ్లను కనిపెట్టుకొని ఉండలేం. అందుకే పిల్లలు గది దాటకుండా, బయటికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రస్తుతం ‘ఇండోర్‌ బేబీ సేఫ్టీ గేట్స్‌’ మార్కెట్లోకొచ్చాయి.

లోహం, చెక్క, మెష్‌.. వంటి మెటీరియల్స్‌తో వివిధ రకాల డిజైన్లలో తయారుచేసిన వీటిని ఫొటోలో చూపినట్లుగా తలుపు ఫ్రేమ్‌కు ఇరువైపులా బిగించుకోవాల్సి ఉంటుంది. వీటిలోనూ ఒక వైపు నుంచి లాగి లాక్‌ చేసుకునేలా, ఫోల్డ్‌ చేసుకునేలా, ఇంకాస్త పొడవుగా ఎక్స్‌టెన్షన్‌ చేసుకునేలా.. ఇలా విభిన్న మోడల్స్‌లో ఇవి దొరుకుతున్నాయి. బేబీని మనం ఉన్న గదిలో కూర్చోబెట్టుకొని, ఈ గేట్స్‌ని లాక్‌ చేసుకుంటే సరి.. పాపాయి కూడా బయటికి వెళ్లే వీల్లేక అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటుంది. ఇక నిశ్చింతగా మన పని మనం చేసుకోవచ్చు. అయితే వీటిని తలుపులకే కాకుండా.. మెట్ల వద్ద, బాల్కనీలోకి వెళ్లే ఆర్చ్‌ వద్ద కూడా బిగించుకోవచ్చు. తద్వారా చిన్నారి మెట్లు ఎక్కకుండా, దిగకుండా, తద్వారా గాయాల పాలు కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాంటి బేబీ సేఫ్టీ గేట్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్