Makeup: ఈ పొరపాట్లు వద్దు..!
సౌందర్య సంరక్షణ విషయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.. ఈ క్రమంలో అవేంటో చూద్దాం రండి..
సౌందర్య సంరక్షణ విషయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకోకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.. ఈ క్రమంలో అవేంటో చూద్దాం రండి..
త్రెడింగ్ చేసేటప్పుడు..
కనుబొమ్మలను త్రెడింగ్ చేసుకునేటప్పుడు అద్దం ముందు మరీ దగ్గరగా నిలబడకూడదు. కాస్త దూరంలో ఉండి త్రెడింగ్ చేసుకుంటే లోటు పాట్లు స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఎక్కువ లేదా తక్కువ సమస్య లేకుండా కనుబొమ్మలు సమానంగా, ఆకృతి కూడా అందంగా ఉంటాయి.
నుదురుపై తక్కువగా..
మేకప్ చేసుకునేటప్పుడు మనకి తెలియకుండానే నుదురు మీద కాస్త ఎక్కువగా అప్త్లె చేసేస్తాం. ఇలా చేయడం వల్ల చర్మం ముడతల్లో కనుక మేకప్ చేరితే మచ్చల్లా కనిపించి అందాన్ని తగ్గించేస్తుంది. అందుకే నుదుటిపై వీలైనంత తక్కువగా మేకప్ వేసుకోవడం మంచిది.
లిప్‌లైనర్.. జాగ్రత్తగా..
సాధారణంగా లిప్‌స్టిక్ వేసుకునే ముందు లిప్ లైనర్‌తో పెదాలకు ఆకృతినిచ్చి తర్వాత లిప్‌స్టిక్ అప్త్లె చేస్తాం. అయితే లిప్‌లైనర్ ఉపయోగించడంలో కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పొడి పెదాలపై లైనర్ అంత తొందరగా కదలదు. అదే లిప్‌స్టిక్ వేసిన పెదాలపై చాలా సునాయాసంగా కదులుతుంది. కాబట్టి పెదవుల ఆకృతి సులభంగా, అందంగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి ముందుగా లిప్‌స్టిక్ వేసుకుని తర్వాత లైనర్‌తో అవుట్‌లైన్ ఇచ్చుకుని మళ్లీ లిప్‌స్టిక్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోండి.
ఐ మేకప్ చేసుకునేటప్పుడు..
కొంతమంది ఐ మేకప్ చేసుకునేటప్పుడు మస్కారా వేసుకున్న తర్వాత ఐ షాడో వేసుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ముందు ఐ షాడో వేసుకుని, తర్వాత మస్కారా వేసుకోవాలి. లేదంటే తడిగా ఉన్న రెప్పలపై ఐ షాడో పడితే కనురెప్పలకు దుమ్ము అంటుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ముందు ఐ షాడో అప్త్లె చేసుకుని తర్వాత మస్కారా వేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.