సౌందర్య సంరక్షణకూ తేనె!

తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. ఆరోగ్యానికే కాదు.. సౌందర్య పరిరక్షణలోనూ తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Published : 26 Aug 2023 18:14 IST

తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. ఆరోగ్యానికే కాదు.. సౌందర్య పరిరక్షణలోనూ తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా?

కాలిన గాయాల పైన తేనెను పూయడం వల్ల మచ్చలు పడవు.

మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

తేనె రాయడం వల్ల మొటిమల మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి.

తేనె పూయడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

తేనె చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుంది. అంటే చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుందన్నమాట!

మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారిందా..? తేనెను పూయడం వల్ల ఈ నలుపు తగ్గి మృదువుగా మారుతుంది.

పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల త్వరగా సన్నబడే అవకాశాలు ఎక్కువ.

రోజూ తేనెను తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరిగి చర్మం కాంతులీనుతుంది.

ఇవి కూడా..

తేనె జుట్టుకు సహజ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.

తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది.

తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, సలాడ్స్‌లో చక్కెరకు బదులుగా తేనెను వాడొచ్చు. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్