పెరుగు.. జుట్టుకీ మంచిదే!

పెరుగు.. పొట్టకే కాదు.. జుట్టుకీ మంచిదే అంటున్నారు నిపుణులు. పెరుగుతో కలిపి వేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ వివిధ జుట్టు సమస్యలను పోగొట్టి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. ఇదిగో ఈ ప్యాక్స్ ఇలాంటివే..

Published : 22 Dec 2023 12:12 IST

పెరుగు.. పొట్టకే కాదు.. జుట్టుకీ మంచిదే అంటున్నారు నిపుణులు. పెరుగుతో కలిపి వేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ వివిధ జుట్టు సమస్యలను పోగొట్టి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. ఇదిగో ఈ ప్యాక్స్ ఇలాంటివే..

పెరుగు, మినుములతో..

జుట్టు మృదువుగా, బలంగా తయారు కావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి.

కావాల్సినవి

⚛ మినుములు - అర కప్పు

⚛ పెరుగు - అర కప్పు

ప్యాక్ ఇలా!

మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.

⚛ ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.


పెరుగు, మెంతులతో..

మీ జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి..

కావాల్సినవి

⚛ గడ్డ పెరుగు - ఒక కప్పు

⚛ మెంతులు - పావు కప్పు

ప్యాక్ ఇలా!

ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్‌లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.

గుర్తుంచుకోండి..

⚛ ఈ ప్యాక్‌ను పొడిగా ఉన్న జుట్టు పైనే అప్త్లె చేసుకోవాలి.

⚛ వారానికోసారి ఈ ప్యాక్ ట్రై చేయచ్చు.

⚛ వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఈ ప్యాక్ తయారు చేసి పెట్టుకోవాలి.

చూశారుగా.. పెరుగు జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో.. కాబట్టి ఇలాంటి సహజసిద్ధమైన, సులభంగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మీ కురులను కాపాడుకోండి. అయితే ఈ క్రమంలో- తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్