మంగు మచ్చలొస్తున్నాయి!

నా వయసు 30. గత కొంత కాలంగా నా ముఖంపై మంగు మచ్చలొస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్‌ సలహా మేరకు క్రీమ్స్‌ వాడుతున్నా. సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా రోజూ రాసుకుంటున్నా. కానీ సమస్య పూర్తిగా తగ్గడం లేదు. ఏం చేయాలి?

Published : 22 Feb 2024 13:13 IST

నా వయసు 30. గత కొంత కాలంగా నా ముఖంపై మంగు మచ్చలొస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్‌ సలహా మేరకు క్రీమ్స్‌ వాడుతున్నా. సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా రోజూ రాసుకుంటున్నా. కానీ సమస్య పూర్తిగా తగ్గడం లేదు. ఏం చేయాలి? - ఓ సోదరి

జ. మీకు మంగు మచ్చలు ఉన్నాయి.. దానికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్‌ క్రమం తప్పకుండా వాడుతున్నానంటున్నారు. అయితే మంగు మచ్చలు అనేవి మూడు రకాలుగా వస్తుంటాయి. కొంతమందికి పిగ్మెంటేషన్ చర్మం పైపొరల్లో ఉంటుంది. దీన్ని ‘ఎపిడెర్మల్‌ మెలాస్మా’ అంటారు. కొంతమందికి చర్మం లోపలి పొరల్లో పిగ్మెంటేషన్‌ వస్తుంటుంది. దీన్ని ‘డెర్మల్‌ మెలాస్మా’ అంటారు. మరికొంతమందికి రెండు పొరల్లోనూ పిగ్మెంటేషన్‌ ఉంటుంది. దీన్ని ‘మిక్స్‌డ్‌ మెలాస్మా’ అంటారు.

మిక్స్‌డ్‌ మెలాస్మా ఉన్నప్పుడు క్రీమ్స్‌, సన్‌స్క్రీన్స్‌ ఉపయోగించడం వల్ల ఫలితం ఉన్నప్పటికీ.. చర్మం లోపలి పొరల్లో పిగ్మెంటేషన్‌ కొద్దిగా ఉండిపోతుంటుంది. దానివల్ల సమస్య అలాగే ఉన్న భావన కలుగుతుంది. మీరు ఇప్పటికే కొన్ని రకాల క్రీమ్స్‌, సన్‌స్క్రీన్స్‌ ఉపయోగిస్తున్నారు. కాబట్టి, వాటికి తోడు డాక్టర్‌ సలహా మేరకు కొన్ని రకాల మందులను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్‌ క్రీమ్‌ క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పలు రకాల అడ్వాన్స్‌డ్‌ లేజర్‌ ట్రీట్‌మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణుల సలహా మేరకు వాటిని ప్రయత్నించచ్చు. అలాగే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఫౌండేషన్ క్రీమ్స్‌ ద్వారా వాటిని కవర్‌ చేసుకోవడం మరో మార్గం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్