ఈ గోరింటకు భౌగోళిక గుర్తింపు...

పండగ, శుభకార్యాల్లో.. ఆడపిల్లల చేతికి అందాలను అద్దుతుంది గోరింటాకు.  అంతగా మహిళల జీవితాలకు ముడిపడి, వారి మనసును దోచుకునే దీనికి వందలేళ్ల నుంచీ రాజస్థాన్‌లో ఎంతో గుర్తింపు ఉంది. పండించే విధానం నుంచి సంప్రదాయపు డిజైన్ల వరకు దీనికున్న ప్రత్యేకతే... ఇటీవల భౌగోళిక గుర్తింపును తెచ్చిపెట్టింది.

Published : 10 Oct 2021 00:37 IST

పండగ, శుభకార్యాల్లో.. ఆడపిల్లల చేతికి అందాలను అద్దుతుంది గోరింటాకు.  అంతగా మహిళల జీవితాలకు ముడిపడి, వారి మనసును దోచుకునే దీనికి వందలేళ్ల నుంచీ రాజస్థాన్‌లో ఎంతో గుర్తింపు ఉంది. పండించే విధానం నుంచి సంప్రదాయపు డిజైన్ల వరకు దీనికున్న ప్రత్యేకతే... ఇటీవల భౌగోళిక గుర్తింపును తెచ్చిపెట్టింది.

* రూ.1000 కోట్లు...
రాజస్థాన్‌లో తరతరాల నుంచీ దీన్ని పండిస్తున్నవారు ఉన్నారు. రోజుకి వేల టన్నుల గోరింటాకు పొడి ఈ ప్రాంతం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడి సోజత్‌ ప్రాంతం ఈ పంటకు ప్రసిద్ధి. ఈ పట్టణ జనాభా 1.25 లక్షలమందిలో గోరింటాకు రైతులు, వ్యాపారులు, పనిచేసే సిబ్బంది కుటుంబాలే ఎక్కువ. ఏటా రూ.1000 కోట్ల విలువైన గోరింటాకు ఇక్కడి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి అవుతుంది. దీని నాణ్యతే... భౌగోళిక గుర్తింపునకూ కారణమైంది. ఈ ప్రాంతంలోని వాతావరణం, వర్షపాతం, మట్టి అన్నీ గోరింటాకుకు ప్రత్యేకమైన వర్ణాన్ని అందించడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిందంటారు అక్కడివారంతా. అంతేకాదు, సాధారణంగా ఎర్రగా పండటానికి బెంజిల్‌ ఆల్కహాల్‌ వంటి రసాయనాలు కలుపుతుండగా, రాజస్థాన్‌ గోరింటాకు సహజసిద్ధమైన పద్ధతుల్లోనే ప్యాకింగ్‌ చేస్తుండటంతో ఈ ప్రాంతమే దేశంలోనే ఈ పంటకు ప్రముఖంగా నిలిచింది. ప్రముఖ మెహందీ డిజైనర్లు తమకు కావాల్సిన గోరింటాకు పొడిని ఇక్కడి నుంచే ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్న రాజస్థాన్‌ గోరింటాకుకు ఈ ప్రత్యేకమైన గుర్తింపు దక్కడంతో ఎగుమతి మరింత పెరగడానికి అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్