కలిపి రాయండి!

కాలానికి తగ్గట్టుగా దుస్తులను మార్చినట్టే.. క్రీములూ మార్చాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలం. వేసవిలో చర్మసంరక్షణకు ఏవి మేలని చూస్తున్నారా.. వీటిని ప్రయత్నించేయండి.

Published : 08 Apr 2023 00:19 IST

కాలానికి తగ్గట్టుగా దుస్తులను మార్చినట్టే.. క్రీములూ మార్చాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలం. వేసవిలో చర్మసంరక్షణకు ఏవి మేలని చూస్తున్నారా.. వీటిని ప్రయత్నించేయండి.

* ముడతలా.. విటమిన్‌ సి ఉన్న క్రీములకు అదనంగా సన్‌స్క్రీన్‌ లోషన్‌నీ తప్పనిసరి జోడీ చేసుకోండి. విటమిన్‌ సి కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. యూవీ కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. వృద్ధాప్యఛాయలనీ దరిచేరనీయదు. సన్‌స్క్రీన్‌ లోషన్‌ దీనికి జత అయితే వాతావరణంలోని మార్పులు, ఎండవేడి నుంచి చర్మానికి సంపూర్ణ రక్షణ దొరుకుతుంది.

* పిగ్మెంటేషన్‌కి.. ఈ కాలంలో ముఖంపై నల్లమచ్చ పెద్ద సమస్య. చెమటకు దుమ్ము తోడైతే యాక్నే! నియాసినమైడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ క్రీములు వాడండి. నియాసినమైడ్‌ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తే సాల్సిలిక్‌ యాసిడ్‌ యాక్నేకి చెక్‌ పెట్టేయగలదు. అదనంగా చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు యవ్వనంగా కనిపించేలానూ చేస్తాయి.

* నున్నగా మెరిసే చర్మానికి.. రెటినాల్‌, పెప్టైడ్‌ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ని రాత్రే రాయాలి. ఇది యాక్నేతో పాటు గీతలు, ముడతలను తగ్గిస్తుంది. పెప్టైడ్స్‌ కణాలను రిపేర్‌ చేసి, చర్మం మృదువుగా మెరిసేలా చేస్తుంది.

* తాజాదనానికి.. పొడిచర్మం వారిలో కొందరికి కాలంతో సంబంధం లేకుండా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. పైగా మృతకణాల సమస్య. హైలురోనిక్‌ యాసిడ్‌తోపాటు ఏహెచ్‌ఏ, బీహెచ్‌ఏ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.

ఎంపిక ఎలా.. ఒకటి సీరమ్‌, మరొకటి మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌గా లేదా ఉదయం, రాత్రి క్రీముల్లో భాగంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు రెండింటి లాభాలు పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని