తల్లిపాలతో రక్తపోటు దూరం...

నవజాత శిశువుకు తల్లిపాల నుంచి అందే వ్యాధినిరోధక శక్తి భవిష్యత్తులో ఆ చిన్నారికి రక్తపోటు సమస్యను దూరంగా ఉంచుతుందట.

Updated : 07 Aug 2021 02:56 IST

వజాత శిశువుకు తల్లిపాల నుంచి అందే వ్యాధినిరోధక శక్తి భవిష్యత్తులో ఆ చిన్నారికి రక్తపోటు సమస్యను దూరంగా ఉంచుతుందట. ఎక్కువ కాలంపాటు తల్లి పాలను తాగే పిల్లల్లో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందంటూ కెనడియన్‌ పరిశోధన సంస్థ నివేదిక తెలిపింది. 2,400 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని జరిపారు. 2009-2012 సంవత్సరాల మధ్య ప్రసవించిన తల్లులు, వారి పిల్లల వివరాలను సేకరించి ఈ అధ్యయనం జరిపారు. తల్లిపాలను తాగే కాలాన్నిబట్టి పిల్లల ఆరోగ్యంలో కలిగే మార్పులను గుర్తించారు. తక్కువ రోజులు తల్లి పాలను తాగిన చిన్నారులకు మూడేళ్ల నుంచే రక్తపోటు సమస్య మొదలైనట్లు తేలింది. రెండేళ్లపాటు తల్లిపాలను తాగే పిల్లల్లో ఆరోగ్యస్థాయులు పెరగగా, రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించలేదు. ఆరునెలల నుంచి ఏడాదివరకు తాగిన చిన్నారుల్లో అధికబరువు, మధుమేహం, జీర్ణశక్తికి సంబంధించి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి ఆరునెలలు తప్పనిసరిగా తల్లిపాలను, ఆ తర్వాత దాంతో పాటు బార్లీ, ఓట్స్‌ వంటి ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలను ఆవిరిపై ఉడికించి అందించిన చిన్నారులు ఆరోగ్యవంతులుగా ఉండటాన్ని గుర్తించారు. ప్రసవించిన మొదటి మూడు రోజుల్లోని తల్లిపాల ద్వారా ఉత్పత్తి అయ్యే కొలోస్ట్రం నవజాత శిశువుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని, ఇది వారిని భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా అధ్యయనవేత్తలు తెలిపారు. అంతేకాదు... వీలైనంత ఎక్కువ కాలం పిల్లలకు స్తన్యాన్ని అందించే తల్లులు క్యాన్సర్‌, మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమాకు దూరంగా ఉన్నట్లు తెలిసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్