ఆ 28 రోజులూ...

నెలసరి వస్తుందనగా మనలో కోపం, చిరాకు, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. తర్వాత అవి నెమ్మదిగా సద్దుమణుగుతాయి. ఇవేకాదు ఒకనెలసరికీ, మరొకదానికీ మధ్య ఎదురయ్యే దశల్లో శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఆ పరిస్థితులని అర్థం చేసుకోవడం చాలా అవసరం...

Updated : 14 Sep 2021 01:10 IST

నెలసరి వస్తుందనగా మనలో కోపం, చిరాకు, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. తర్వాత అవి నెమ్మదిగా సద్దుమణుగుతాయి. ఇవేకాదు ఒకనెలసరికీ, మరొకదానికీ మధ్య ఎదురయ్యే దశల్లో శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఆ పరిస్థితులని అర్థం చేసుకోవడం చాలా అవసరం..

మెన్‌స్ట్రుయేషన్‌ దశ: అంటే నెలసరి మొదటిరోజు నుంచి లెక్కపెట్టుకోవాలి. ఈ దశలో హార్మోన్లు చాలా స్తబ్దుగా ఉంటాయి. మనలో శక్తి కూడా తగినంతగా ఉండదు. అందుకే కోపం, చిరాకు వంటివి ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ ఒత్తిడిని కలిగించే వ్యాయామాలు చేయకూడదు. శక్తినిచ్చే సూపులు, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

ఫాలిక్యులర్‌ దశ: నెలసరి అయిపోయిన ఐదు లేదా ఆరో రోజు నుంచి ఈ దశ మొదలయి 13వరోజు వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. మనలో శక్తితోపాటు, సృజనాత్మక స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరీ ఒత్తిడిని పెంచే వ్యాయామాలు చేయకుండా కొద్దిపాటి విరామాలిచ్చి శరీరం చెప్పిన మాట వింటూ వ్యాయామాలు చేయాలి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరల్ని తీసుకోవాలి. పొట్టుతో ఉన్న ఆహారం తీసుకుంటే మరీ మంచిది.  

ఓవులేషన్‌ దశ: పద్నాలుగు నుంచి 21 వరోజు వరకూ ఉండే దశ ఇది. ఈస్ట్రోజెన్‌ అత్యధికంగా విడుదలయ్యే సమయం ఇది. శరీరంలో జీవక్రియల రేటు చాలా చురుగ్గా ఉంటుంది. నలుగురితో కలవడానికి... చురుగ్గా ఉండటానికి ఆసక్తి చూపిస్తాం. ఈ సమయంలో పీచు ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు, ఆకుకూరల్ని తీసుకుంటే మంచిది.

లూటియల్‌ దశ: నెలసరి అయిన 22 నుంచి 28 రోజూ వరకూ ఉన్న సమయం. ఈ దశలో ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కారణం ఓవులేషన్‌ దశలో అండం ఫలదీకరణం చెందితే... పిండంగా మారడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి నెలసరికి శరీరం సిద్ధమవుతుంది. ఇందులో ఏది జరిగినా ఈ సమయంలో విటమిన్‌ డి, క్యాల్షియం, మెగ్నీషియం, పీచు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. దీనివల్ల చక్కని నిద్ర అందడంతోపాటు ఒత్తిడిని జయించగలుగుతాం. రోస్టింగ్‌, బేకింగ్‌ చేసిన పదార్థాలు తింటే మంచిది. నెలసరి సమయం సజావుగా సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్