ఒత్తయిన జుట్టుకు ఈ నాలుగు!

కురులు చక్కగా, ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఎలాంటి పూత వేసుకోవాలో అందులో ఏయే పోషకాలుంటాయో చూద్దామా...కొబ్బరినూనె... జుట్టుకు నిగారింపుతో పాటు మృదుత్వాన్నీ అందిస్తుంది.

Updated : 22 Nov 2022 15:34 IST

కురులు చక్కగా, ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఎలాంటి పూత వేసుకోవాలో అందులో ఏయే పోషకాలుంటాయో చూద్దామా...

కొబ్బరినూనె... జుట్టుకు నిగారింపుతో పాటు మృదుత్వాన్నీ అందిస్తుంది. కొబ్బరిలోని ప్రొటీన్లు కురులు రాలకుండా చేయడంతోపాటు అవి బలంగా, చక్కగా పెరగడానికి తోడ్పడతాయి.

ఆలివ్‌ ఆయిల్‌... కేశాలను కాంతులీనేలా చేస్తుంది. పొడి జుట్టు ఉన్నవారు దీన్ని వాడితే చక్కటి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది.

లావెండర్‌ ఆయిల్‌..  జుట్టు త్వరగా పెరగడానికి ఉపయోగ పడుతుంది. సువాసనలనూ అందిస్తుంది.

గుడ్లు... ఇందులోని బోలెడు పోషకాలు జుట్టుకు రక్షణను ఇస్తాయి. పచ్చసొన వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తే.. విటమిన్‌ ఎ, కె, బయోటిన్‌లు అవి చక్కగా పెరగడానికి దోహదపడతాయి.

ఎలా తయారు చేసుకోవాలంటే... గిన్నెలో గుడ్డును పగలగొట్టాలి. దీంట్లో రెండు పెద్ద చెంచాల చొప్పున కొబ్బరి, ఆలివ్‌, పెద్ద చెంచా లావెండర్‌ నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మాడుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు చక్కగా పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్